Friday, April 26, 2024

59కి చేరిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

Corona cases

 

శుక్రవారం ఒక్క రోజు 14 పాజిటివ్‌లు
విదేశీయులు స్వచ్ఛందంగా వివరాలు తెలపాలి

మన తెలంగాణ /హైదరాబాద్ : రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా శుక్రవారం ఒక్క రోజులో 14 పాజిటివ్‌లు రావడం అందరిని ఆందోళనకు గురిచేస్తుంది. దీంతో ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య 59కి చేరింది. ఒకవైపు కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండగా, మరోవైపు కేసులు పెరుగుతుండటంతో అధికారులు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడంతో స్వీయ నియంత్రణే మేలని అధికారులు సూచిస్తున్నారు. అదే విధంగా ఇప్పటికే వైరస్ రెండవ దశ నుంచి మూడో దశ దగ్గరికి చేరడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ఇదిలా ఉండగా ఇటీవలే పాజిటివ్ వచ్చిన కొత్తగూడెం డిఎస్పీ కొడుకు ప్రత్యక్షంగా కలసిన మొత్తం 23 మందిని పరీక్షించగా, అందరికి నెగటివ్ వచ్చిందని వైద్యాధికారులు తెలిపారు.

అనుమానిత లక్షణాలు ఉన్న వారికి ఆర్టీపిసిఆర్ పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్థారణ అయితే ఐసొలేషన్ వార్డులో చికిత్సలు నిర్వహిస్తున్నామని వైద్యాధికారులు వెల్లడించారు. దీంతో పాటు గురువారం వచ్చిన నలుగురు పాజిటివ్ వ్యక్తులను ప్రత్యక్షంగా కలసిన 10 మందిని కూడా క్వారంటైన్ చేసి పరీక్షలు నిర్వహిస్తున్నామని, శనివారం రిపోర్టులు వచ్చే అవకాశం ఉందని డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రస్తుతం గాంధీ, ఫీవర్, చెస్ట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల అందరి ఆరోగ్యం మెరుగ్గా ఉందని, రెండు మూడు రోజుల్లో కోలుకున్న వారిని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
కరోనా కంట్రోల్ రూం నంబర్లు : కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా తమ వివరాలు తెలపాలని వైద్యాధికారులు కోరుతున్నారు. వైరస్ నియంత్రణకు సహాకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే విదేశాల నుంచి వచ్చిన వారు 040 23450624, 23450735 నంబర్లను సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు.

 

Corona cases reaching 59
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News