Sunday, April 28, 2024

కరో’నో షో’

- Advertisement -
- Advertisement -

Corona

 

రాష్ట్రమంతటా అమల్లోకి బంద్ ఆదేశాలు

రోడ్లపై గణనీయంగా తగ్గిన జనసమ్మర్దం
విద్యాసంస్థలు, థియేటర్లు, బార్లు, పార్కులు, జూపార్కు, ఫిట్‌నెస్ సెంటర్లు బంద్
సినిమా షూటింగ్‌లు ఆపివేయాలని నిర్ణయం
21 వరకు హెచ్‌ఎండిఎ పరిధిలో పార్కుల మూసివేత, 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలు రద్దు

మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా భయం రాష్ట్రాన్ని ప్రభావితం చేసింది. దానిని రానియ్యకుండా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం శనివారం నాడు ముందు జాగ్రత్తగా జారీ చేసిన ఆదేశాలు రాష్ట్రమంతటా అమల్లోకి వచ్చాయి. రాజధాని హై దరాబాద్ సహా అంతటా విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, బార్లు, పార్కులు, క్లబ్‌లు వగైరా మూతపడ్డాయి. రోడ్లపై జనసమ్మర్థం బాగా తగ్గిపోయింది. హైదరాబాద్‌లోని జూపార్కును మూసివేశారు. గోల్కొండ, చార్మినార్, 7 టూంబ్స్, మ్యూజి యం తో పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉన్న ప్రముఖ పర్యాటక క్షేత్రాలు కూడా జన సంచారం లేకుండా పోయాయి. ఆదివారం ఉదయం నుంచి షోలు రద్దు చేసినట్లు సినిమా థియేటర్ల ముందు బోర్డులు వెలిశాయి. అలాగే పలు కీలకమైన జనసమూహ ప్రాం తాలు సైతం వెలవెలబోయాయి.

సాధారణంగా ఆదివారల్లో కనిపి ంచే రద్దీ కూడా ఆయా ప్రాంతాల్లో కనిపించలేదు. సెలవు రోజుల్లో కిటకిటలాడే ఇండోర్, ఔట్‌డోర్ స్టేడియాలు, జిమ్‌లు కూడా జనాల సందడి కరువైంది. ఇక సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సినిమా షూటింగ్‌లు కూడా నిలిచిపోనున్నాయి. చిత్ర పరిశ్రమకు చెందిన నిర్మాతల మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు సిఎం కెసిఆర్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం విధితమే. నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలతో పాటు అవసరమైతే జైలుకు పంపుతామని హెచ్చరించడంతో ఆగమేఘాలపై ఆదేశాలు అమలవుతున్నాయి. ఇప్పటికే పలు పలు విద్యాసంస్థలు, కళాశాలలు ఈ నెల 31 వరకు మూసివేస్తున్నట్లు ఆయా సంస్థల యజమాన్యాలు ప్రకటించాయి.

దీంతో వారంతా సొంత ప్రాంతాలకు బయలుదేరడంతో జెబిఎస్, ఎంజిబిఎస్ బస్ స్టేషన్‌లలో ప్రయాణికులతో కిటకిటలాడాయి. సాధారణంగా అయితే ఆదివారాల్లో అయితే మల్టీప్లెక్సులతో పాటు ముఖ్యమైన థియేటర్లలో సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కానీ కరోనా వైరస్‌ను ముందుస్తుగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తాత్కాలికంగా షోలను నిలిపివేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లలో సినిమాల ప్రదర్శనలను పూర్తిగా నిలిచిపోయాయి. అలాగే ఎన్‌టిఆర్ పార్క్, జూపార్కుల్లోనూ సందర్శల జాడ మచ్చుకైన కనిపించ లేదు.

కాగా ప్రభుత్వ ఆదేశాల మే రకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటి (హెచ్‌ఎండిఎ) పరిధిలోని లుంబినీ పార్కు, ఎన్‌టిఆర్ గార్డెన్, ఎన్‌టిఆర్ మెమోరియల్, సంజీయయ్య పార్కులను ఈ నెల 21వ వరకు మూసివేయాలని సంబంధిత అధికారులు నిర్ణయించారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాల వేదికలైన శిల్పారామం, త్యాగరాయగానసభ, రవీంధ్రభారతిల్లో కార్యక్రమాలు పూర్తిగా రద్దు అయ్యాయి. ఇక సభలు, సమావేశాలు, స్పోర్ట్ ఇవెంట్స్‌ను కూడా అనుమతులు లేకపోవడం, ఉన్న ఇవెంట్‌ను ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసింది. దీంతో జనసమూహం అధికంగా ఉండే క్రీడా స్టేడియాల్లో సైతం ప్రేక్షకుల సందడి లేక వెలవెలపోతున్నాయి.

Corona fear has affected the state
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News