Tuesday, May 7, 2024

రికరీ భేష్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పేషెంట్లు వేగంగా కోలుకుంటున్నారు. దీంతోనే రికవరీ రేట్ పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి సగటున రికవరీ రేట్ 82.5 ఉండగా, మన దగ్గర 82.68 శాతం మంది కోలుకున్నట్లు హెల్త్ బులెటెన్‌లో వెల్లడించారు. మరో 16.82 శాతం మంది ఆసుపత్రుల్లోని ఆక్సిజన్, వెంటిలేటర్లపై చికిత్స పొందుతుండగా, వైరస్ దాడిలో 0.50 శాతం మంది మరణించినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అంటే దేశ సగటు 1.1 శాతం కంటే మన దగ్గర 0.50 అతి తక్కువ డెత్ రేట్ రికార్డు కావడం గమనార్హం. బాధితులను సకాలంలో గుర్తించి వైద్యం అందించడం వలనే ఇది సాధ్యమవుతుందని అధికారులు అంటున్నారు. దీంతోనే డెత్ రేట్ తగ్గుతుందని అధికారులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అదే విధంగా ప్రస్తుతం రాష్ట్రంలో 69,221 యాక్టివ్ కేసులుండగా, వీరిలో 95 శాతం మందికి ఎలాంటి ప్రాణాపాయం లేదని, మరో 5 శాతం మంది వెంటిలేటర్ చికిత్స పొందాల్సి వస్తుందని ఆరోగ్యశాఖ పేర్కొంది. అంతేగాక కరోనా వైరస్ బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న(యాక్టివ్ కేసులు) వారూ మన దగ్గరే తక్కువ మంది ఉన్నారు. ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలో చాలా తక్కువ మంది కరోనా వైరస్‌కు చికిత్స తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించడం వలనే అతి తక్కువ సమయంలోనే ఆరోగ్యవంతులుగా మారుతున్నట్లు అధికారులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేవలం పది నుంచి 14 రోజుల్లో చాలా మంది సులువుగా కోలుకుంటున్నారని ఆఫీసర్లు పేర్కొంటున్నారు. ఇతర రాష్ట్రాల్లో చాలా మంది 20 నుంచి30 రోజులు వరకు కూడా కోలుకోవడం లేదని రాష్ట్రానికి కొందరు అధికారులు చెప్పుకొస్తున్నారు. మరోవైపు దీర్ఘకాలిక వ్యాధులు ఉండి కరోనా సోకిన వారిలోనూ చాలా మంది కోలుకున్నారు.
16 రాష్ట్రాల్లో వైరస్ తీవ్రత అధికం…..
దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో వైరస్ తీవ్రత అధికంగా ఉంది. వీటిలో ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యాన, జమ్ము కాశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సా, రాజస్థాన్, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్‌లు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలను పరిశీలిస్తే అర్థం అవుతుంది. అన్‌లౌక్ పీరియడ్‌లో ఇతర రాష్ట్రాలకు రాకపోకలు సాగడం వలనే వ్యాప్తి పెరిగిందని కేంద్ర అధికారులు చెబుతున్నారు.
21 నుంచి 50 ఏళ్లే వారే 60 శాతం మంది..
రాష్ట్రంలో వైరస్ బారిన పడుతున్న వారిలో 21 నుంచి 50 ఏళ్లు వారు ఏకంగా 60 శాతం మంది ఉన్నారు. ఉద్యోగాలు, వ్యాపారం, ఇతర కార్యక్రమాల నిమిత్తం బహిరంగ ప్రదేశాలు, మార్కెట్లలో తిరిగే క్రమంలో కరోనా నిబంధనలు పాటించకపోవడం వలనే వీరికి వైరస్ సోకుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అంతేగాక మొత్తం బాధితుల్లో 61.5 శాతం పురుషులు, 38.5 శాతం స్త్రీలు ఉన్నట్లు ఆరోగ్యశాఖ నివేదికలో తెలిపారు.

Corona Recovery rate increased in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News