Sunday, April 28, 2024

మాస్కు ఉంటే ఆసుపత్రుల్లో అడుగు పెట్టాలి

- Advertisement -
- Advertisement -

Corona regulations are tightened in Govt hospitals

కోవిడ్ నిబంధనలు పాటించుకుంటే లోపలికి అనుమతి లేదు
పేదలకు వైద్యం అందించే పెద్ద ఆసుపత్రుల్లో సెక్యూరిటీ అలర్ట్
చలి తీవ్రతో గత వారం రోజుల నుంచి పెరుగుతున్న రోగులు
కోవిడ్ నిబంధనలు పాటించకుంటే మహమ్మారి రెక్కలు
నిర్లక్ష్యం చేసే జరిమానాలు వేస్తామని వైద్యాధికారుల హెచ్చరికలు

హైదరాబాద్: నగరంలో ఒమికాన్ కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా నిబంధనలు మరింత కఠినతరం చేస్తూ జిల్లా వైద్యాధికారులు చర్యలు చేపట్టారు. గత నెల రోజుల నుంచి బహిరంగ ప్రదేశాల్లో తిరిగే వారికితో పాటు, మార్కెట్లు, మాల్స్, వస్త్ర దుకాణాల్లో మాస్కులు ధరించని వారికి జరిమానాలు వేస్తూ నిబంధనలు అమలు చేస్తుండగా, ఇక నుంచి గ్రేటర్‌లోని అన్ని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రులతో పాటు, బస్తీదవఖానలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మాస్కులు ధరిస్తేనే లోపలికి అనుమతి ఉంటుందని పేర్కొంటున్నారు. ఈసందర్భంగా అన్ని దవఖానలకు ఆదేశాలు జారీ చేసినట్లు వైద్య సిబ్బంది వెల్లడించారు. నేటి నుంచి రోగులతో పాటు, వారితో వచ్చే సహాయకులు తప్పనిసరి మాస్కులు ధరించాలి, నిర్లక్షం చేస్తే ఆసుపత్రిలోకి అడుగు పెట్టనివ్వబోమని హెచ్చరిస్తున్నారు.

అందుకు ఉస్మానియా, గాందీ, ఫీవర్, ఈఎన్‌టి, కింగ్‌కోఠి, ప్రసూతి, యునానీ, సరోజనీ కంటి ఆసుపత్రుల్లో సెక్యూరిటీ సిబ్బందిని అప్రమత్తం చేసి, మాస్కులు లేని వారి పట్ల కఠినంగా వ్యవహారించాలని ఆదేశించారు. అదే విధంగా గ్రేటర్ పరిధిలో 258 బస్తీదవఖానలు, 86 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బంది మాస్కులు లేకుండా ఇష్టానుసారంగా వచ్చేవారిని గేటు బయట నుంచే వెనక్కి పంపాలని, బలవంతంగా లోపలికి వస్తే సమీప పోలీసుస్టేషన్ సమాచారం అందించి వారి రానివ్వద్దని వైద్యశాఖ ఉన్నతాధికారులు సూచించినట్లు వెల్లడించారు. గత పది రోజుల నుంచి చలి తీవ్రం కావడంతో పలు వ్యాధులతో జనం ఆసుపత్రులకు వస్తున్నారని,వారితో కుటుంబ సభ్యులు రావడంతో రద్దీగా మారిందని, మార్కెట్లు, షాపుల్లో ఉండే జనం రద్దీ కంటే దవఖానలో ఉండటంతో వైరస్ రెక్కలు కట్టుకుంటుందని, అందుకోసం ముందుగా ఆసుపత్రుల్లో జాగ్రత్తలు పాటిస్తే మహమ్మారి విజృంభించకుండా నియంత్రణ చేయవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News