Saturday, April 27, 2024

ఇండియా@ 67 వేలు…. ఒక్క రోజే 4200 కేసులు

- Advertisement -
- Advertisement -

CORONA

ఢిల్లీ: ప్రస్తుతం కరోనా వైరస్ దేశమంతా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ముంబయిలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 22,171 కేసులు నమోదు కాగా 832 మంది మృత్యువాతపడ్డారు. ముంబయిలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. ముంబయిలో 13 వేలకు పైగా కేసులు నమోదు కాగా 508 మంది చనిపోయారు. ప్రస్తుతం భారత దేశంలో కరోనా బాధితుల సంఖ్య 67,298కి చేరుకోగా 2213 మంది మృతి చెందారు. కరోనా వైరస్ నుంచి 21 వేల మంది కోలుకోగా 44 వేల మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 4200 కేసులు నమోదుకాగా 97 మంది కరోనాకు బలయ్యారని కేంద్రం ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు 42 లక్షల కరోనా కేసులు నమోదు కాగా 2.84 లక్షల మంది చనిపోయారు. ఒక్క అమెరికాలో కరోనా వైరస్ 13.67 లక్షల మందికి వ్యాపించగా 80,787 వేల మంది మరణించారు.

రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు బాధితులు సంఖ్య చికిత్స పొందుతున్నవారు కోలుకున్నవారు మృతులు
మహారాష్ట్ర
22,171 17,140 4,199 832
గుజరాత్
8,195 5,157 2,545 493
తమిళనాడు
7,204 5,198 1,959 47
ఢిల్లీ 6,923 4,781 2,069 73
రాజస్థాన్ 3,898 1,537 2,253 108
మధ్య ప్రదేశ్ 3,614 1,723 1,676 215
ఉత్తర ప్రదేశ్
3,467 1,735 1,653 79
ఆంధ్రప్రదేశ్ 1,980 1,010 925 45
పశ్చిమ బెంగాల్ 1,939 1,337 417 185
పంజాబ్ 1,823 1,626 166 31
తెలంగాణ 1,196 415 751 30
జమ్ము కశ్మీర్
861 469 383 9
కర్నాటక
848 394 422 31
హర్యానా 731 411 310 10
బిహార్ 707 347 354 6
కేరళ 513 20 489 4
ఒడిశా 391 320 68 3
ఛండీగఢ్ 173 146 24 3
ఝార్ఖండ్ 157 76 78 3
త్రిపుర 151 149 2 0
ఉత్తరాఖండ్ 68 21 46 1
అస్సాం 62 26 35 1
ఛత్తీస్ గఢ్
59 10 49 0
హిమాచల్ ప్రదేశ్
55 14 35 3
లడఖ్ 42 21 21 0
అండమాన్ నికోబార్ దీవులు
33 0 33 0
మేఘాలయ 13 2 10 1
పుదుచ్చేరీ
12 4 8 0
గోవా 7 0 7 0
మణిపూర్ 2 0 2 0
మిజోరం
1 0 1 0
అరుణాచల్ ప్రదేశ్ 1 0 1 0
దాద్రా నగర్ హవేలీ డమాన్ డయ్యూ
1 1 0 0
మొత్తం 67,298 44,090 20,991 2,213

దేశాల వారిగా వివరాలు మీకోసం

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News