Sunday, May 5, 2024

భారత్ లో కొత్తగా 24,492 కరోనా కేసులు…..

- Advertisement -
- Advertisement -

Corona virus india active cases

ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు మళ్లీ కరోనా వైరస్ తీవ్రత పెరుగుతోంది. గత కొన్ని రోజుల నుంచి కరోనా వైరస్ విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 24,492 కరోనా కేసులు నమోదుకాగా 131 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 1.14 కోట్లకు చేరుకోగా 1.58 లక్షల మంది చనిపోయారు. కరోనా వ్యాధి నుంచి 1.102 కోట్ల మంది కోలుకోగా 2.23 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు దేశంలో 3.29 కోట్ల మందికి కరోనా టీకా ఇచ్చారు. దేశంలో ఇప్పటివరకు 22.82 కోట్ల మంది కరోనా నిర్థారణ పరీక్షలు చేశామని ఐసిఎంఆర్ ప్రకటించింది. కరోనా కేసుల సంఖ్యలో మహారాష్ట్ర(23.29 లక్షలు) తొలి స్థానంలో ఉండగా వరసగా కేరళ(10.92 లక్షలు), కర్నాటక (9.61 లక్షలు), ఆంధ్రప్రదేశ్ (8.92 లక్షలు) రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణ (3.01 లక్షలు) 12వ స్థానంలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News