Sunday, April 28, 2024

రాష్ట్రంలో కొవిడ్ విజృంభణ

- Advertisement -
- Advertisement -

24 గంటల్లో 2,295కేసులు
జిహెచ్‌ఎంసి పరిధిలోనే అత్యధికం
64,744 మందికి రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ టెస్టులు
చికిత్సపొందుతూ ముగ్గురు మృతి

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 64,744 పరీక్షలు నిర్వహించగా 2,295 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య,ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,89,751కి చేరింది. వైరస్ బారిన పడి ముగ్గురు చనిపోగా మొత్తం మృతుల సంఖ్య 4,039కి చేరింది. కరోనా నుంచి 278 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9,861 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. జిహెచ్‌ఎంసి పరిధిలో అత్యధికంగా 1452, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో 232 మందికి వైరస్ నిర్ధారణ అయింది. రంగారెడ్డిలో 218, హనుమకొండ 54, సంగారెడ్డి 50, నిజామాబాద్, ఖమ్మంలో 29 చొప్పున కొత్త కేసులు వచ్చినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ నిన్నటితో పోల్చితే పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. కాగా, పక్క రాష్ట్రంఎపిలో గడచిన 24గంటల్లో కొత్తగా 840 కరోనా కేసులు న మోదయ్యాయి. వైరస్ బారిన పడి విశాఖలో ఒకరు మృతి చెందగా మరో 133 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News