Sunday, April 28, 2024

నేడు కౌంటింగ్

- Advertisement -
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు

ఉదయం 8గంటలకు ప్రారంభం

తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు
8.30 గంటలకు ఈవిఎంలలోని ఓట్ల కౌంటింగ్

టేబుల్‌కు ఆరుగురు అధికారులు

కేంద్రంలోకి 14మంది ఏజెంట్లకు అనుమతి
కేంద్ర పరిశీలకుడికి తప్ప ఇతరులకు సెల్‌ఫోన్ నిషేధం
తొలి ఫలితం భద్రాచలం.. చివరగా శేరిలింగంపల్లి ఫలితం
ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తం వీడియో రికార్డింగ్
కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

ప్రతి ఈవిఎంను మూడుసార్లు లెక్కించాల్సి ఉన్నందున ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం

కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు : సిఇఒ వికాస్ రాజ్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా నేడు ఉదయం 8 గంటలకు 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. కౌంటింగ్ కోసం 1766, పోస్టల్ బ్యాలెట్ కో సం 131 సిద్దం చేశారు. ఈఎన్నిక ల్లో 2290 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొదటి ఫలితం భద్రాచ లం, చివరిగా శేరిలింగంపల్లి నియోజకవర్గం ఫలితం వెళ్లడయ్యే అవకాశ ఉంది. నియోజకవర్గానికి కేటాయించిన కేటాయించిన టేబుళ్ల వద్ద కు ఎలక్షన్ సిబ్బంది, అభ్యర్థుల ప్ర తినిధులను గరిష్ఠంగా 14 మంది ఏ జెంట్లను అనుమతిస్తారు. ఆ లెక్కిం పు కేంద్రం పరిశీలకుడు మినహా మి గతా ఎవరికీ సెల్ ఫోన్ తీసుకు వ చ్చే అధికారం లేదని ముందుగా ఈ విఎంలను పరిశీలిస్తారని ఎన్నికల అధికారులు తెలిపారు. సీల్ ట్యాంపరింగ్ జరగలేదని నిర్ధారించుకునేందుకు ఆ టేబుల్ దగ్గర ఉన్న సిబ్బం ది, ఏజెంట్లు ఈవిఎంను పరిశీలిస్తా రు. ఈవిఎంల సీల్‌పై ఏజెంట్లకు అ నుమానం కలిగితే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చన్నారు. లెక్కింపు నుంచి ఎన్నికల ఫలితాల వెల్లడి వరకు బాధ్య త అంతా రిటర్నింగ్ అధికారి పైనే ఉంటుంది.

పార్టీ అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు, ఎలక్షన్ ఏజెంట్లను లెక్కింపు కేం ద్రంలోకి అనుమతిస్తారు. ఒక్కో కౌం టింగ్ కేంద్రంలో 14 మందికి మిం చకుండా ఏజెంట్లను అనుమతిస్తారు. ఫారం-17 సిలో నమోదు చేసిన ఓట్లను ఈవిఎంలలో నిక్షిప్తమైన ఓ ట్ల సంఖ్యతో సరిచూస్తారు. కౌంటిం గ్ సిబ్బంది ఆ సంఖ్యను ఫారం 17 సి పార్ట్ 2 నోట్ చేసుకుని, దానిపై ఏజెంట్ల సంతకం తీసుకుంటారు. అనంతరం ఈవీఎంల సీల్ తొలగించి ఫలితాల బటన్ నొక్కుతారు. ఆ ఈవీఎంలో పోలైన ఓట్లలో ఎ వరికి ఎన్ని ఓట్లు వచ్చాయనే విషయం తెలుస్తుంది. ఆ వివరాలను కౌంటింగ్ సిబ్బంది నో ట్ చేస్తారు. ఆ సంఖ్యను ఏజెంట్లు అందరికీ చూపించి, వారు సంతృప్తి వ్యక్తం చేశాకే రౌం డ్ ఫలితాలను వెల్లడిస్తారు. ఒక్కో రౌండ్ లో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయనే వివరాలను కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన బోర్డుపై సిబ్బంది రాస్తారు. ఈ ప్రక్రియ మొత్తం వీడియో తీసి భద్రపరుస్తారు.
కౌంటింగ్‌కు సర్వం సిద్ధ్దం : సిఇఒ
రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పా ట్లు చేసినట్లు ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. మొత్తం 49 ఓట్ల లెక్కింపు కేంద్రాలలో ఉద యం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైతుందని తెలిపింది. అరగంటలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌం టింగ్ పూర్తవుతుందని అధికారులు చెప్పారు. ఆ తర్వాత ఈవీఎంలను లెక్కించడం మొదలైతుందని ప్రతీ ఈవిఎంను మూడుసార్లు లె క్కించాల్సి ఉంటుందని దీంతో ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని సిఈవో వికాస్ రాజ్ చెప్పారు. ఈవిఎంలను భద్ర పరిచిన స్ట్రాంగ్ రూంల ముందు కేంద్ర, రాష్ట్ర బలగాలతో మూడంచెల భద్రత ఏర్పాటు చేసింది. లోపల, బయట సిసి కెమెరాలను అమర్చి ప్ర త్యేక నిఘా పెట్టినట్లు లోపలికి వెళ్లడానికి, రావడానికి ఒకే దారి ఉంటుందని స్ట్రాంగ్ రూమ్‌కు డబుల్ లాక్ సిస్టం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నియోజకవర్గానికి 14 చొప్పున టేప్పున, పోలింగ్ కేంద్రాలు ఎక్కువ ఉన్న నియోజకవర్గాలకు ఎక్కువ టేబుళ్లు ఏర్పాటు చేశామన్నారు. ఉప్పల్, మల్కాజ్ గిరి, కూకట్ పల్లి, పటాన్ చెరు నియోజకవర్గాలకు 20ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 500 లకు పైగా కేంద్రాల్లో పోలింగ్ జరిగిన శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, మహేశ్వరం, మేడ్చల్ నియోజకవర్గాల్లో 28 ఏర్పా టు చేసినట్లు వివరించారు. ఒక్కో టేబుల్‌కు ఆరుగురు అధికారులు ఉంటారు. మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ సూపర్‌వైజర్, ఇద్దరు కౌం టింగ్ అసిస్టెంట్లతో సహా ఒక్కో టేబుల్‌కు మొ త్తం ఆరుగురు ఉంటారని వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News