Saturday, May 11, 2024

దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి

- Advertisement -
- Advertisement -

lav agarwal

 

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్(కోవిడ్-19) కేసులపై కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 678 కొత్త కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కాగా.. 33 మంది చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుందన్నారు. తాజా కేసులతో దేశంలో మొత్తం 6,412 కరోనా కేసులు నమోదు అయ్యాయని, ఇప్పటివరకు కరోనాతో 199 మంది మరణించారని తెలిపారు. 503 మంది కరోనా బాధితులు కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారన్నారు. 24 గంటల్లో 16002 పరీక్షలు చేస్తే కేవలం 0.2 శాతమే పాజిటీవ్ గా నిర్దారణ అయ్యాయన్నారు. జనవరిలో మనకున్నది ఒకే ఒక్క ల్యాబ్‌ అని, ప్రస్తుతం దేశంలో 146 ప్రభుత్వ ల్యాబ్స్‌, 67 ప్రైవేట్‌ ల్యాబ్స్‌ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. దేశంలో సరిపడా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ టాబ్లెట్స్‌ నిల్వలు ఉన్నాయన వివరించారు.

Covid 19 Cases Increases fastly in India: Lav Agarwal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News