Sunday, April 28, 2024

సెకండ్ వేవ్ ముప్పు తొలగిపోలేదు

- Advertisement -
- Advertisement -

Covid second wave threat was not eliminated

మెట్రో నగరాల్లో ఆర్ వాల్యూ 1కన్నా ఎక్కువ ఉంటోంది
44 జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు 10 శాతంకన్నా ఎక్కువ ఉంది
ఇది ఆందోళనకరమన్న కేంద్రం

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ముప్పు ముగియలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం స్పష్టం చేసింది. 8 రాష్ట్రాల్లో ఆర్ వాల్యూ అధికంగా ఉందని కూడా హెచ్చరించింది. ఇది చెప్పుకోదగ్గ సమస్య అని కూడా పేర్కొంది. దేశంలోని 44 జిల్లాల్లో కేస్ పాజిటివిటీ రేటు 10 శాతానికన్నా ఎక్కువగా ఉందని కేంద్ర ప్రభుత్వం కొవిడ్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ డాక్టర్ వికె పాల్ చెప్పారు. గడచిన నాలుగు వారాల్లో 18 జిల్లాల్లో కేసుల పెరుగుదలధోరణి కనిపిస్తోందని కూడా ప్రభుత్వం తెలిపింది. ‘ డెల్టా వేరియంట్ అతిపెద్ద సమస్యగా ఉంది. దేశంలో ఇంకా సెకండ్ వేవ్ కొనసాగుతోంది’ అని పాల్ అన్నారు. ఆర్‌వాల్యూ 0.6 శాతంకన్నా తక్కువగా ఉండాలనే విషయం గుర్తుంచుకోండి. ఒక వేళ అది ఒకటికన్నా ఎక్కువ ఉంటే అది చెప్పుకోదగ్గ సమస్య అని, వైరస్ వ్యాప్తి చెందుతోందని అర్థం’ అని ఆయన చెప్పారు.ఆర్ వాల్యూ ఒకటికన్నా ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్, జమ్మూ, కశ్మీర్, లక్షద్వీప్, తమిళనాడు, మిజోరాం, కర్నాటక, పుదుచ్చేరి, కేరళ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలో మాత్రమే తగ్గుదల ధోరణి కనిపిస్తోంది.

బెంగాల్, నాగాలాండ్, హర్యానా, గోవా, ఢిల్లీ, జార్ఖండ్‌లలో ఆర్ వాల్యూ ఒకటిగా ఉంది. ఆర్ వాల్యూ అంటే రీప్రొడక్టివ్ వాల్యూ అని అర్థం. వైరస్ సంక్రమణ అవుతున్న తీరును ఈ పద్ధతిలో అంచనా వేస్తారు. సాధారణంగా ఆర్ వాల్యూ ఒకటికన్నా తక్కువ ఉంటే అప్పుడు వైరస్‌తో ముప్పు లేదు. కానీ ఒక పాయింట్‌ను దాటితోఅప్పుడు ఆర్ వాల్యూతో ప్రమాదమే ఉంటుంది. ఉదాహరణకు ఆర్ వాల్యూ 0.9గా ఉంటే అప్పుడు 100 మంది వల్ల 90 మందికి మాత్రమే వైరస్ సోకే ప్రమాదం ఉన్నట్లు అంచనా. ఆర్‌వాల్యూ ఒకటి దాటితే అప్పుడు వైరస్ విజృంభిస్తున్నట్లు భావిస్తారు. దీన్ని అదుపు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ చెప్పారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, భారత్‌లలో సగటున ఆర్ వాల్యూ 1.2 శాతం ఉందని ఆయన చెప్పారు.

చెన్నైకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్( ఐఎంఎస్) జూలై చివరి నాటికి వైరస్ వ్యాప్తిని అంచనా వేసింది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఆర్ వాల్యూ ఒకటికన్నా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించింది. ఢిల్లీలో ప్రస్తుతం 1.03కు చేరగా,చెన్నైలో 1.15, కోల్‌కతాలో 1, బెంగళూరులో 1కి చేరువలో ఉన్నట్లు గుర్తించింది. ఇతర నగరాలు, పట్టణాల్లో కూడా ఇదే తీరు కనిపించడం ఆందోళన కలిగించే విషయమని ఐఎంఎస్ పరిశోధనా బృందానికి నాయకత్వం వహిస్తున్న సితభ్ర సిన్హా అభిప్రాయపడ్డారు. అయితే ఇది మూడో వేవ్‌కు కారణమవుతుందాఅనడానికి ప్రస్తుత పరిస్థితులను మరికొన్ని రోజులు గమనించాల్సిన అవసరం ఉందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News