Sunday, April 28, 2024

టీకా జాతర

- Advertisement -
- Advertisement -

 

 రాష్ట్రంలో కరోనా కంట్రోల్‌లోనే ఉంది : హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు
 హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా 40వేల మందికి వ్యాక్సినేషన్
 సైబరాబాద్ పోలీస్, ఎస్‌సిఎస్‌సి, మెడికవర్ ఆస్పత్రుల ఆధ్వర్యంలో నిర్వహణ

మన తెలంగాణ/సిటీబ్యూరో: కరోనాను పూర్తిగా నియంత్రించడమే లక్షంగా నగరంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉద్యమంలా కొనసాగుతోంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒకే రోజు, ఓకే చోట 40 వేల మందికి వ్యాక్సినేషన్ వేశారు. ఇందుకు నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ వేదికైంది. ఆదివారం హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమానికి రాష్ట్ర పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్పేర్ డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీనివాసరావు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ, సైబరాబాద్ పోలీసు కమిషనర్ వి.సి. సజ్జనర్, తెలంగాణ సూపర్ స్పెషాలటీ హస్పటల్స్ అసోసియేషన్ (టిఎస్‌ఎస్‌హెచ్‌ఎ) ప్రధానకార్యదర్శి ఆర్.గోవింద్ హరి, ఎస్‌సిఎస్‌సి సెక్రటరీ జనరల్ వై.కృష్ణలు పాల్గొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం, సైబరాబాద్ పోలీసులు, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో మెడికవర్ ఆసుపత్రులు ఈ ప్రత్యే క డ్రైవ్‌ను ఏర్పాటు చేశాయి. హైటెక్స్‌లో మొత్తం 30 హాళ్లలో 300 ద్వారా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగింది.

దీంతో ఫస్ట్ అవర్‌లోనే 5వేల మందికి వ్యాక్సినేషన్ వేశారు. పూర్తిగా కొవిడ్ నిబంధనలను పాటిస్తూ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కొనసాగించారు. అంతేకాకుండా అత్యవసర వైద్యసేవల కోసం ప్రత్యేకంగా 5 పడకలను ఏర్పాటు చేయడంతో పాటు 10 అంబులెన్స్‌లను అందుబాటులో పెట్టారు. ఈ సందర్భంగా పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్పేర్ డైరెక్టర్ డా. శ్రీనివాస రావు మాట్లాడుతూ సెకండ్ వేవ్ రూపంలో ఒక్కసారిగా విజృభించిన కరోనా వైరస్‌ను అతి తక్కువ కాలంలో నియంత్రణలోకి వచ్చిందన్నారు. ఇందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిన వ్యాక్సినేషన్, లాక్‌డౌన్‌కు తోడు అనేక కట్టడి చర్యలను చేపట్టడంతో ఇది సాధ్యమైందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.75 కోట్ల మందికి వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు లక్షంగా నిర్ధేశించుకో గా ఇప్పటి వరకు 52 లక్షలమందికి టీకాలు వేసినట్లు ఆయన వెల్లడించారు. అదేవిధంగా సైబరాబాద్ పోలీసు కమిషనర్ వి.సి.సజ్జానర్ మాట్లాడుతూ టీకా పట్ల ప్రజల్లో ఉన్న కొన్ని ఆపోహల కారణంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొంత మందకొడిగా సాగిందని, ఇప్పుడు అన్ని పటా పంచలు కావడంతో వేగం పుంజుకుందని తెలిపారు.
ఒకే రోజు 40వేల మంది రిజిస్ట్రేషన్
ఆదివారం సెలవురోజు కావడంతో నగరవాసులు పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్‌కు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఆన్‌లైన్ ద్వారా పేర్లను నమోదు చేసుకుని అందులోనే డబ్బులు చెల్లించడం ద్వారా ఏలాంటి క్యూలైన్లు లేకుండా, ఏ ఒక్కరిని సంప్రదించాల్సిన అవసరం లేకుండా పూర్తిగా సామాజిక దూరం పాటిస్తూ, పేపర్ రహితంగా అత్యంత సులభంగా వ్యాక్సినేషన్ తీసుకునే ఏర్పాట్లు చేశారు. దీంతో ఒకే రోజు 40వేల మంది వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ చేసుకుని టీకాలను వేయించుకున్నారు. దీంతో భారీగా జనాలు తరలి రావడంతో హైటెక్స్ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. అయితే భారీగా పోలీసులను మోహరించి ట్రాఫిక్‌ను ఎప్పటికప్పుడు క్లియర్ చేశారు.
వారం పాటు మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్
రాష్ట్ర పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్పేర్ విభాగం పర్యవేక్షణలో మెడికవర్ గ్రూప్ ఆఫ్ హస్పటల్స్ ద్వారా వా రం రోజుల పాటు కొనసాగను న్న వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు సంబంధించి డాక్టర్లు, నర్సులు, అడ్మినిస్ట్రేషన్ సిబ్బందితోపాటు పోలీసులు, వాలింటర్ల మొత్తం 1650మంది తమ సేవలను అందించనున్నారు. ఇందులో 700 మంది నర్సులు, 300 మందిఅడ్మినిస్ట్రేషన్ సిబ్బంది, మరో 150 మంది వాలీంటర్లులు ఉన్నారు. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వ్యాక్సినేషన్ వేయనున్నారు. వ్యాక్సినేషన్ వేయించుకోవాలనుకునే వారు మెడికవర్ ఆసుపత్రుల అధికారిక వెబ్‌సైట్ http:/ medicoveronline.com,/vaccination ద్వారా పేర్ల ను నమోదు చేసుకోవాల్సి ఉంది. మరింత సమాచారం కావాల్సిన వారు 68334455 ద్వారా సంప్రదించవచ్చు.

Covid Vaccination drive at Hitech City

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News