Tuesday, May 28, 2024

కాంగ్రెస్ పార్టీ తర్వాత సిపిఐకే సుదీర్ఘ చరిత్ర

- Advertisement -
- Advertisement -

CPI Party has long history after Congress party

 

హైదరాబాద్: నగరంలోని మఖ్దూం భవన్ లో సిపిఐ 96వ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించారు. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి జెండా ఎగురవేసి ఆవిర్భావ వేడుకలను ప్రారంభించారు. వ్యవస్థాపక దినోత్సవంలో చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తర్వాత సిపిఐకే సుదీర్ఘ చరిత్ర ఉందని సురవరం అన్నారు. దున్నేవాడిదే భూమి పోరాటం చేసింది సిపిఐనే ఆయన గుర్తుచేశారు. కన్నీళ్లు, ఆకలి ఉన్నన్ని రోజులు వామపక్ష పార్టీలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటరీ వ్యవస్థలో గెలుపోటములు సహజమని సురవరం తెలిపారు. మోడీ, అదానీ, అంబానీలే నూతన సాగు చట్టాలను తెచ్చారని సురవరం సుధాకర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా 80 వేల ట్రక్కులతో లక్షలాది మంది రైతులు పోరాటం చేస్తున్నారు. బోగస్ రైతులతో ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని సురవరం మండిపడ్డారు.

CPI Party has long history after Congress party

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News