Saturday, May 4, 2024

సమస్యలపై ప్రముఖులు స్పందించాలి: ఇర్ఫాన్ పఠాన్

- Advertisement -
- Advertisement -

ముంబై: సమాజాన్నీ పట్టి పీడిస్తున్న సమస్యలపై క్రీడా ప్రముఖులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, వీటిపై క్రీడా ప్రముఖులు ఏమాత్రం స్పందించక పోవడం మంచి పరిణామం కాదన్నాడు. సమస్యలపై క్రీడాకారులు కూడా స్పందించాల్సిన అవసరం ఎంతైన ఉందన్నాడు. అప్పుడే చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయన్నాడు. బియాండ్ ద ఫీల్డ్ అనే కార్యక్రమంలో ఇర్ఫాన్ మాట్లాడాడు. ఈ సందర్భంగా ఎన్నో విషయాలను అతను వెల్లడించాడు. దేశంలో ఇప్పటికీ చాలా సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయన్నాడు. ఈ సమస్యలను ఎవరూ కూడా పట్టించుకోక పోవడంతో సమాన్య ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురికాక తప్పడం లేదన్నాడు.

ఈ అంశాలపై క్రీడా ప్రముఖులు స్పందించాల్సిన అవసరం ఎంతైన ఉందన్నాడు. సమాజంలో క్రీడాకారులకు ఎంతో సముచిత గౌరవంగా లభిస్తుందని, వారు ఈ సమస్యలపై స్పందిస్తే పాలకులు దీన్ని పరిష్కరించేందుకు ముందుకు వస్తారనే నమ్మకాన్ని ఇర్ఫాన్ వ్యక్తం చేశాడు. సహజంగా ఎవరైనా క్రీడా ప్రముఖులు లేదా క్రికెటర్లు సమాజాన్ని ప్రభావితం చేసే అంశాలపై స్పందించడం అనవాయితీ అన్నాడు. అయితే భారత్‌లో మాత్రం ఇలాంటి స్పందన కొంత వరకు మాత్రమే కనిపిస్తుందన్నాడు. కొన్ని అంశాల్లోనే క్రికెటర్లు, ఇతర క్రీడా ప్రముఖులు స్పందిస్తూ ఉంటారన్నాడు. కానీ, ప్రజలను పీడిస్తున్న పలు అంశాలపై వారి నుంచి ఏమాత్రం స్పందన ఉండదని ఇర్ఫాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా క్రీడాకారులు, క్రికెటర్లు ప్రజా సమస్యలపై తమ గొంతు విప్పాల్సిన అవసరం ఎంతైన ఉందన్నాడు. అప్పుడే సమాజానికి మేలు జరుగుతుందని ఇర్ఫాన్ అభిప్రాయపడ్డాడు.

Cricketers don’t speak on Sensitive: Irfan Pathan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News