Tuesday, May 14, 2024

పెళ్లి తర్వాతే ఆ పౌరాణిక చిత్రం ప్రారంభం

- Advertisement -
- Advertisement -

భారీ చిత్రాల దర్శకుడిగా పేరున్న గుణశేఖర్ కొన్నాళ్లుగా తన టీమ్‌తో కలిసి ఓ భారీ పౌరాణిక చిత్రంపై పనిచేస్తున్నాడు. 2015లో ‘రుద్రమదేవి’ చిత్రాన్ని తెరకెక్కించిన ఈ దర్శకుడు దాదాపు మూడేళ్లుగా ‘హిరణ్యకశిప’ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నాడు. విష్ణు భక్తుడు ప్రహ్లాదుడు తండ్రి అయిన రాక్షసరాజు హిరణ్యకశిపుడు విష్ణుమూర్తి ద్వేషి. ఇతని సంహారం కోసం మహావిష్ణువు నరసింహ అవతారం ఎత్తాడు. ఆ రాక్షసరాజు నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతుండగా హిరణ్యకశిప పాత్రను రానా చేయనున్నాడు. పాన్ ఇండియా సినిమాగా సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుండగా, ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులను దర్శకుడు గుణశేఖర్ పూర్తి చేశాడు. కరోనా లాక్ డౌన్, రానా పెళ్లి వంటి విషయాల కారణంగా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయినా సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి కొంచెం సమయం పట్టేలా కనిపిస్తోంది. దానికి తోడు రానా ఇప్పటికే కొన్ని సినిమాలు ఒప్పుకొని ఉన్నాడు. ఇక రానా, మిహికాల వివాహం ఆగస్టు 8న జరుగనుంది.

Hiranya Kashyapa movie pre production completed

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News