Tuesday, May 7, 2024

రొనాల్డొ కొత్త ప్రపంచ రికార్డు

- Advertisement -
- Advertisement -

Cristiano Ronaldo create record

ఫారో: పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డొ కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ల అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా రొనాల్డొ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ కెరీర్‌లో రొనాల్డొ 111 గోల్స్‌తో అగ్రస్థానంలో నిలిచాడు. ఐర్లాండ్‌తో జరిగిన ప్రపంచకప్ అర్హత మ్యాచ్‌లో ఈ పోర్చుగల్ దిగ్గజం రెండు గోల్స్ కొట్టాడు. దీంతో ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ 21తో ఐర్లాండ్‌ను ఓడించింది. ఈ రెండు గోల్స్‌తో రొనాల్డొ ఫుట్‌బాల్‌లోనే అత్యంత అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటి వరకు 180 మ్యాచ్‌లు ఆడిన రొనాల్డొ తన ఖాతాలో 111వ గోల్‌ను జమ చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇరాన్ ఆటగాడు అలీ పేరిట ఉన్న (109) గోల్స్ రికార్డును రొనాల్డొ తిరగ రాశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News