Wednesday, May 1, 2024

ఏడేళ్లలో రాష్ట్రంలో పంటల సాగు గణనీయంగా పెరిగింది

- Advertisement -
- Advertisement -

Crop cultivation increased in Telangana

అందుకు అనుగుణంగా ఎరువులను సరఫరా చేయాలి
ఇఫ్కో ప్రతినిధులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి

హైదరాబాద్: ఏడేళ్లలో తెలంగాణలో పంటల సాగు గణనీయంగా పెరిగిందని, అందుకు అనుగుణంగా ఎరువులను సరఫరా చేయాలని ఇఫ్కో ప్రతినిధులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ఇఫ్కో ప్రతినిధులతో మంత్రి నిరంజన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇఫ్కో మార్కెటింగ్ డైరెక్టర్ యోగేంద్ర కుమార్, జిఎం జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ మార్కెటింగ్ మేనేజర్ కృపా శంకర్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ సాగునీటి సరఫరా, రైతుబంధు, రైతుబీమా, ఉచితంగా 24 గంటల విద్యుత్ సరఫరా మూలంగా వ్యవసాయం మీద రైతులకు నమ్మకం పెరిగిందన్నారు.

వ్యవసాయం దండగ అనే పరిస్థితి నుంచి పండుగ అనే పరిస్థితికి వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవసాయ అనుకూల విధానాలతో ధాన్యం దిగుబడిలో తెలంగాణ దేశంలో రెండో స్థానానికి చేరిందని, రైతుల ఆత్మహత్యలు తగ్గి ఆత్మవిశ్వాసంతో వ్యవసాయం చేస్తున్నారని ఆయన తెలిపారు. పంటల ప్రణాళిక ప్రకారం తెలంగాణకు యూరియా సరఫరా చేయాలన్నారు. తెలంగాణలో నానో యూరియా ప్లాంట్ ఏర్పాటు కోసం ఇఫ్కో సమావేశంలో చర్చించా లన్నారు. దక్షిణ తెలంగాణలో నానో యూరియా ప్లాంట్ ఏర్పాటుతో దక్షిణ భారతదేశం మొత్తానికి అందుబాటులో ప్లాంట్ ఉంటుందని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News