Saturday, May 4, 2024

గాంధీకి పెరుగుతున్న సాధారణ రోగులు

- Advertisement -
- Advertisement -

Growing ordinary patients to Gandhi hospital

ఓపి ద్వారా రోజుకు 300మందికి సేవలు
కొవిడ్ రోగుల కోసం 250 పడకలు కేటాయింపు
గాంధీ ప్రారంభం కావడంతో ఉస్మానియాకు తగ్గిన రోగులు
వాయిదా వేసి శస్త్రచికిత్సలు త్వరలో చేస్తామంటున్న వైద్యులు

హైదరాబాద్: నగరంలో పేదల వైద్యానికి పేరుగాంచిన గాంధీ ఆసుపత్రిలో నాన్ కోవిడ్ సేవలు ప్రారంభించడంతో ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకునేందుకు గత మూడు రోజుల నుంచి ఆసుపత్రికి వస్తున్నారు. నాలుగు నెలల పాటు దవఖాను పూర్తిగా కోవిడ్ రోగులకు కేటాయించడంతో సాధారణ రోగులు ప్రైవేటు ఆసుపత్రి ఆశ్రయించే పరిస్దితి నెలకొంది. దీంతో చాలామంది రోగులు ఉస్మానియా ఆసుపత్రి వెళ్లారు. అక్కడ రోజు 1500 మందికిపై రోగులు వస్తుండటంతో వైద్యాధికారులు గాంధీ ఆసుపత్రిలో సాధారణ సేవలు మొదలు పెడితే ఉస్మానియాపై భారం తగ్గుతుందని, అదే విధంగా కరోనా కంటే ముందుకు పలువురికి శస్త్రచికిత్స చేసేందుకు గడువు ఇచ్చారు. వారు కూడా పాజిటివ్ కేసులు తగ్గడంలో తమకు వైద్యం చేయాలని కోరడంతో గాంధీ ఆసుపత్రి ఉన్నతాధికారులు ఈనెల 3వ తేదీన సాధారణ రోగులకు సేవలందించడం ప్రారంభించారు. మొదటి రోజు తక్కువ సంఖ్యలో వచ్చిన మూడో రోజు నుంచి రోగుల రద్దీ పెరిగిందని వైద్యులు పేర్కొంటున్నారు. అత్యవసర సేవలు, ఓపి, ఐపీ సేవలతో అందుబాటులోకి వచ్చాయి.

తొలి రోజు సుమారు 200 మంది, రెండవ రోజు 284 మంది, మూడో రోజున 315 మంది బయటి రోగులు వైద్య సేవల కోసం ఆసుపత్రికి వచ్చారు. ఉదయం 8.30గంటల నుంచి 11గంటలవరకు ఓపి సేవలు అందించారు. మెట్ల వెనకాల ఉన్న ఫార్మసీని ఓపి గేటు పక్క నున్న కేంద్రంలోకి మార్చారు. అక్కడ ఉన్న జీవన్‌ధారా ఫార్మసీ బయటకు మార్చారు. ఆసుపత్రి ప్రధాన భవనంలోని రెండు, మూడు అంతస్తులను కొవిడ్ రోగుల సేవలకు, నాల్గవ అంతస్తును భ్లాక్ ఫంగస్ రోగులకు సేవలకు కేటాయించినట్లు ఆసుపత్రి ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు. మిగతా అంతస్తులో ఉన్న వార్డులను, ఐసీయూ వార్డులను సాధారణ రోగుల సేవలకు వినియోగిస్తామని చెబుతున్నారు.250 ఐసీయూ పడకలు కొవిడ్ రోగులకు, 900 పడకలు సాదారణ రోగులు కేటాయించినట్లు వివరించారు. ఒకవేళ థర్డ్‌వేవ్ వస్తే ఎదుర్కొంటామని వివరిస్తున్నారు. గతంలో వాయిదా వేసిన సర్జరీ చికిత్సలు వచ్చే వారంలో ప్రారంభిస్తామని, చాలామంది రోగులు ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆసుపత్రులకు రావడంతో సిబ్బంది పూర్తి స్దాయిలో అందుబాటులోకి రాగానే శస్త్రచికిత్సలు చేస్తామంటున్నారు.

ప్రజలు జాగ్రత్తంగా ఉంటే థర్‌వేవ్ తరిమికొట్టవచ్చు: వైద్యులు

గత నెల రోజుల నుంచి వర్షాలు కురువడం, పండగలు, వేడుకలు నగర ప్రజలు నిర్వహిస్తుండంతో కొవిడ్ నిబంధనలు పాటించడంలేదని పోలీసుల తనిఖీలో తేలిందని, నిర్లక్షం చేస్తే వైరస్ రెక్కలు కట్టుకుంటుందని గాంధీ వైద్యులు పేర్కొంటున్నారు. ఈఏడాది చివరివరకు ముఖానికి మాస్కులు, భౌతికదూరం పాటించాలని, గుంపులుగా చేరకుండా ఉండాలని, పండగలను కుటుంబ సభ్యులతో పరిమితం సంఖ్యలో చేసుకోవాలని సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News