Sunday, May 12, 2024

వర్షాభావంతో రాష్ట్రంలో పంటలు ఆగం

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయం
ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి
జాతీయ కిసాన్ సెల్ జాతీయ వైస్ ప్రెసిడెంట్ కోదండరెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్:  వర్షాభావంతో రాష్ట్రంలో పంటలు ఆగమవుతున్నాయని జాతీయ కిసాన్ సెల్ జాతీయ వైస్ ప్రెసిడెంట్ కోదండరెడ్డి అన్నారు. ప్రధానంగా వర్షాధార పంటలు దెబ్బతిన్నాయని ఆయన అన్నారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. అధికవర్షాల వల్ల నష్టపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైతులకు దెబ్బ మీద దెబ్బ పడిందని, కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నామని కోదండరెడ్డి అన్నారు. రుణమాఫీతో సంబంధం లేకుండా మళ్లీ ఆదుకోవాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. రైతులకు న్యాయం చేసే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని ఆయన పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News