Tuesday, April 30, 2024

ఈసారి ట్రోఫీ సిఎస్‌కెదే: బ్రెట్‌లీ జోస్యం

- Advertisement -
- Advertisement -

CSK Will win IPL 2020 Trophy : Brett Lee
మెల్‌బోర్న్: యుఎఇ వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కే ట్రోఫీ సాధించే అవకాశాలు అధికంగా ఉన్నాయని ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ బ్రెట్‌లీ జోస్యం చెప్పాడు. రైనా, హర్భజన్ వంటి సీనియర్లు లేకున్నా చెన్నై బలంగానే ఉందన్నాడు. ధోనీ సారధ్యం ఆ జట్టుకు కొండంత బలాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదన్నాడు. యుఎఇకి వచ్చినప్పటి నుంచే చెన్నైకి ఏదీ కలసి రావడం లేదని, అయినా ట్రోఫీని సాధించే అవకాశాలు సిఎస్‌కె పుష్కలంగా కనిపిస్తున్నాయన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే క్రికెటర్లకు జట్టులో కొదవలేద న్నాడు. దీనికి తోడు ధోనీ కెప్టెన్సీ ప్రతిభ కూడా కలిసి వచ్చే అవకాశాలున్నాయన్నాడు. దీంతో తన దృష్టిలో ధోనీ సేననే ఫే వరెట్‌గా కనిపిస్తోందని బ్రెట్‌లీ పేర్కొన్నాడు.

CSK Will win IPL 2020 Trophy : Brett Lee

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News