Friday, April 26, 2024

అరుణాచల్ ప్రదేశ్ బాలుడికి చైనా సైనికుల కరెంట్ షాక్!?

- Advertisement -
- Advertisement -

Current shock of Chinese soldiers to Arunachal Pradesh teen

ఇటానగర్: ఇటీవల అపహరణకు గురైన అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన బాలుడికి చైనా సైనికులు కొట్టి, కరెంట్ షాక్ ఇచ్చినట్లు ఆ బాలుడి తండ్రి ఒపాంగ్ తరోన్ ఆరోపించారు. మిరాం తరోన్(17) అనే బాలుడు లుంగ్తా జొర్ ప్రాంతం నుంచి జనవరి 17న చైనా సైనికులు అపహరించారన్న ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ బాలుడిని చైనా సైనికులు జనవరి 27న తిరిగి భారత దళాలకు అప్పగించగా, సోమవారం సాయంత్రం అతడిని తల్లిదండ్రులకు అప్పగించినట్లు సియాంగ్ జిల్లా డిప్యూటీ కమిషనర్ శాశ్వత్ సౌరభ్ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో మిరాం తరోన్‌కి ఘనస్వాగతం లభించింది. చైనీయుల చేతిలో తన కుమారుడు బందీగా ఉన్నప్పుడు తన కుమారుడి కళ్లకు గంతలు కట్టి కొట్టారని, కరెంట్ షాక్ కూడా ఇచ్చారని అతడి తండ్రి ఒపాంగ్ తరోన్ తెలిపారు. తన కుమారుడు ఇంకా ఈ షాక్ నుంచి తేరుకోలేదని కూడా ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News