Saturday, April 27, 2024

అరుణాచల్ ప్రదేశ్‌పై ఆగని చైనా ప్రేలాపనలు

- Advertisement -
- Advertisement -

జైశంకర్ ప్రకటనపై మళ్లీ అదే వాదన

బీజింగ్: అరుణాచల్ ప్రదేశ్ తమ దేశంలో అంతర్భాగమంటూ చైనా పునరుద్ఠాటించింది. ఈ వాదనను అసంబద్ధం, హాస్యాస్పదమంటూ భారత్ ఖండించినప్పటికీ చైనా మాత్రం మరోసారి ఇదే వాదనతో ముందుకు వచ్చింద.ఇ అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగమని, చైనా వాదన హాస్యాస్పదమని భారత విదేశీ వ్యవహారాల మంత్రి శనివారం చేసిన ప్రకటనకు స్పందనగా చైనా విదేశీ మంత్రిత్వశాఖ ప్రతినిధి లిన్ జియాన్ సోమవారం మళ్లీ పాత పాటే వినిపించారు. భారత్, చైనా మధ్య సరిహద్దు సమస్య పరిష్కారం కాలేదని జిన్ తెలిపారు.

భారత్ అక్రమంగా ఆక్రమించుకోవడానికి ముందు యాంగ్‌నాన్(అరుణచల్ ప్రదేశ్‌కు చైనా అధికారిక పేరు) చైనాలో మొదటినుంచి అంతర్భాగమేనని ఆయన స్పష్టం చేశారు. ఆ ప్రాంతంలో చైనా పాలన సమర్థంగా కొనసాగిందని ఆయన చెప్పారు. అక్రమంగా ఆక్రమించుకున్న ప్రాంతానికి 1987లో భారత్ అరుణాచల్ ప్రదేశ్ అని ఏరు పెట్టుకోవడం ఎవరూ కాదనలేని సత్యమని ఆయన తెలిపారు. భారత్ చర్యలపై తాము కఠినమైన ప్రకటనలు ఇచ్చామని, ఈ విషయంలో చైనా వైఖరిలో ఎటువంటి మార్పులేదని ఆయన చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ చైనా ప్రకటన చేయడం ఈ నెలలో ఇది నాలుగవసారి.

మార్చి 9న భారత ప్రధాని నరేంద్ర మోడీ అరుణాచల్ ప్రదేశ్ సందర్శనకు తాము దౌత్యపరమైన నిరసన భారత్‌కు తెలియచేశామని చైనా ప్రభుత్వం తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌గా వ్యవహరించే చైనా భారత నాయకులు ఆ రాష్ట్రాన్ని సందర్శించిన ప్రతి సందర్భంలోను ఆ ప్రాంతం తమదేనంటూ ప్రకటించడం పరిపాటిగా మారింది. అరుణాచల్ ప్రదేశ్ తమ దేశంలో అంతర్భాగమని చైనా రక్షణ మంత్రి గత వారం చేసిన వాదనను భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ తోసిపుచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News