Wednesday, May 8, 2024

సోయా, సన్‌ఫ్లవర్ నూనెల దిగుమతులపై తగ్గిన సుంకాలు

- Advertisement -
- Advertisement -

Customs Duty On Refined Soyoil, Sunflower Oil Reduced To 7.5%

 

న్యూఢిల్లీ: రిఫైన్డ్ సోయా, పొద్దుతిరుగుడు నూనెల దిగుమతులపై కస్టమ్స్ సుంకాలను 7.5 శాతంమేర కేంద్రం తగ్గించింది. ఇప్పటివరకు ఈ నూనెల దిగుమతులపై 45 శాతం ఉన్న సుంకాలను 37.5 శాతానికి తగ్గిస్తున్నట్టు సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్(సిబిఐసి) ఓ ప్రకటనలో తెలిపింది. తగ్గించిన సుంకాలు ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉంటాయని తెలిపింది. క్రూడ్ పామాయిల్, రిఫైన్డ్, బ్లీచ్డ్ పామాయిల్, పామోలిన్, ఇతర పామాయిల్‌లపై జూన్ 29 నుంచి సుంకాలు తగ్గించింది. దేశం దిగుమతి చేసుకునే వస్తువుల్లో వంట నూనెలది మూడోస్థానం. మొదటి, రెండు స్థానాల్లో క్రూడాయిల్, బంగారం ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News