Saturday, April 27, 2024

హెచ్‌ఎఎల్‌ను సందర్శించిన ఉపరాష్ట్రపతి

- Advertisement -
- Advertisement -

Vice President Venkaiah visits HAL facilities

బెంగళూరు: ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు శుక్రవారం బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఎఎల్) సంస్థలను సందర్శించారు. కర్నాటక గవర్నర్ తావర్‌చంద్ గెహ్లోట్ కూడా ఆయన వెంట ఉన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి హెచ్‌ఎఎల్, ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజన్సీ అధికారులనుద్దేశించి మాట్లాడుతూ, ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో సంస్థలోని ఈ అద్భుతమైన మౌలిక సదుపాయాలను చూసిన తర్వాత దేశ భద్రత, రక్షణ పట్ల తనకు గట్టి నమ్మకం కలిగిందని అన్నారు. హెచ్‌ఎఎల్ చేపట్టిన వివిధ రక్షణ రంగ ప్రాజెక్టుల్లో కొనసాగుతున్న ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యాలను ఆయన ప్రశంసిస్తూ, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్లిష్ట పరిస్థితుల దృష్టా దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేయడానికి దేశీయంగా అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉపరాష్ట్రపతి హెచ్‌ఎఎల్‌ను సందర్శించడం ఇదే తొలిసారి, ఆయన, గవర్నర్‌తో కలిసి కంపెనీలోని ఎల్‌సిహెచ్, ఎఎల్‌హెచ్ హ్యాంగర్స్, తేలిక పాటి యుద్ధ విమానం తేజస్ తయారీ విభాగాలను సందర్శించారు. హెచ్‌ఎఎల్ సిఎండి ఆర్ మాధవన్‌కూడా వారితో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News