Sunday, May 5, 2024

తీరాన్ని తాకిన ‘ఉంపన్’ తుఫాన్.. బెంగాల్, ఒడిశా తీర ప్రాంతాలు అల్లకల్లోలం

- Advertisement -
- Advertisement -

Cyclone 'Amphan'

 

న్యూఢిల్లీ: ‘ఉంపన్’ అతి తీవ్ర తుఫాన్ తీరాన్ని తాకింది. దీంతో బెంగాల్, ఒడిశా తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో గంటకు 170-200 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశాలోని పూరీ, కటక్, కేంద్రపాలరా, గంజాం, భద్రక్ జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. దీంతో తీర ప్రాంతాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. నాలుగు గంటలపాటు కొనసాగుతున్న తుఫాన్.. బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య సుందర్బన్ వద్ద తీరం దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. బంగ్లాదేశ్ వైపు వెళ్లాక తుఫాన్ వాయుగుండంగా మారనున్నట్లు తెలుస్తోంది.

Cyclone ‘Amphan’ to hit Bengal coast

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News