Sunday, April 28, 2024

యోగాతో ఒత్తిడి దూరం

- Advertisement -
- Advertisement -

అశ్వారావుపేట : స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు బుధవారం మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం చేశారు. ముందుగా అంతర్జాతీయ యోగా దినోత్సవం పురష్కరించుకొని స్థానిక వికెడివి కళాశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ఆయన యోగా చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ మానసిక ప్రశాంతకు, శారీరక ఒత్తిడి యోగాతో దూరం అవుతాయని ప్రతీ రోజూ కొంత సమయాన్ని యోగాకు కేటాయించాలన్నారు. అనంతరం మండలంలోని ఊట్లపల్లి పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా రూ.25.5లక్షలతో నిర్మించిన భవనాన్ని, పేరాయిగూడెం బిసి కాలనీలో రూ.16లక్షలతో నిర్మించిన భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మన ఊరు మన బడి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయన్నారు.

అనంతరం ఆయన విద్యార్థులతో కొంతసేపు ముచ్చటించి వారికి చాక్లెట్స్ పంపిణీ చేశారు. గ్రామంలోని ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. నారంవారిగూడెం కాలనీలో రూ.9 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణ పనులకు గ్రామస్థుల కోరిక మేరకు మంజూరు చేశారు. ఈ క్రమంలో గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణ పనులకు, పంచాయతీ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కొబ్బరి కాయ కొట్టి భూమి పూజ చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు.

ఈ కార్యక్రమాలలో ఎంపిపి జల్లిపల్లి శ్రీరామమూర్తి, జెడ్పీటిసి చిన్నంశెట్టి వరలక్ష్మి, ఎంఇఓ పి కృష్ణయ్య, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు బండి పుల్లారావు, మోహన్‌రెడ్డి, సత్యవరపు సంపూర్ణ, సర్పంచ్‌లు నారం రాధ, నార్లపాటి సుమతి, సాధు జ్యోత్సబాయి, కళాశాల ప్రిన్సిపాల్ శేషుబాబు, బిఆర్‌ఎస్ నాయకులు, పాఠశాలల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News