Thursday, May 2, 2024

రైలు ప్రమాద మృతులను ఉంచిన పాఠశాల కూల్చివేత

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్ : ఒడిశా రైళ్ల ప్రమాదంలో మృతదేహాలను భద్రపర్చడానికి తాత్కాలిక శవాగారంగా వినియోగించిన పాఠశాలను కూల్చివేసి అక్కడ నూతన భవనం నిర్మించాలని రాష్ట్ర సిఎం నవీన్ పట్నాయక్ నిర్ణయించారు. బాలేశ్వర్ జిల్లా బహానగా వద్ద ఈ నెల 2న రైళ్లు ఢీకొనగా ప్రమాద మృతులను మొదట పాఠశాల గదుల్లో భద్రపరిచారు. ఆ తరువాత జిల్లా యంత్రాంగం గదులను పరిశుభ్రం చేసి శానిటైజ్ చేయించింది. అయినప్పటికీ అటువైపు వెళ్లడానికి విద్యార్థులు కానీ, తల్లిదండ్రులు కానీ భయపడుతున్నారు.

ఈ విషయాన్ని స్కూల్ ప్రిన్సిపాల్ ప్రమీలా స్వయిన్ బాలేశ్వర్ జిల్లా కలెక్టర్ దత్తాత్రేయ షిండే దృష్టికి తీసుకెళ్లగా, ఆయన ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు వివరించారు. దీనిపై జిల్లా అధికార యంత్రాంగంతో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చర్చించి పాఠశాల కూల్చివేతకు ఆదేశాలిచ్చారు. అక్కడ కొత్త భవనం నిర్మించాలని, అందుకు వివరణాత్మక నివేదిక 15 రోజుల్లోగా సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News