Monday, April 29, 2024

గుజరాత్‌లో ఐసిస్ కుట్ర భగ్నం.. నలుగురు ఉగ్రవాదుల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : గుజరాత్ పోలీస్ యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్ (ఎటిఎస్) భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసింది.పోర్బందర్ పట్టణంలో ఇస్లామిక్ స్టేట్ మాడ్యూల్ గుట్టు రట్టు చేసింది. ఓ మహిళతో సహా నలుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. ఆ నలుగురూ ఐసిఎస్ మాడ్యూల్ లో భాగమేనని అందిన సమాచారం మేరకు ఏటిఎస్ సిబ్బంది దాడులు నిర్వహించారు.

నిందితులు ఏడాది నుంచి ఈ సంబంధాలు కొనసాగిస్తున్నారని ఏటీఎస్ వర్గాలు తెలిపాయి. దేశం విడిచి వెళ్లడానికి, ఐసిఎస్ ఉగ్రవాద సంస్థలో చేరడానికి వీరు వ్యూహం పన్నినట్టు తేలింది. నిందితుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచి చివరకు అరెస్టు చేయగలిగారు. డిఐజి దీపన్ భద్రన్ , ఎస్పీ సునీల్ జోషి ఆధ్వర్యంలో జరిగిన దాడుల్లో సుమేర అనే మహిళతోపాటు ముగ్గురు పురుషులను పోర్బందర్ పట్టణంలోశుక్రవారం అరెస్ట్ చేశారు. వీరి నుంచి అనేక నిషిద్ధ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్‌లో ఐసిఎస్ వర్గాలు వీరిని ప్రలోభపెట్టినట్టు గుర్తించారు. గుజరాత్ ఎటిఎస్ అహమ్మదాబాద్‌లో ముగ్గురు అనుమానిత ఐసిఎస్ ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News