Tuesday, April 30, 2024

దీపక్ పునియాకు రజతం

- Advertisement -
- Advertisement -

Deepak Punia wins silver at Asian Wrestling Championships

ఆల్మాటీ: కజకిస్థాన్‌లోని ఆల్మాటీ సిటీలో జరుగుతున్న ఏసియన్ రెజిలింగ్ చాంపియన్‌షిప్స్‌లో మన దేశానికి చెందిన దీపక్ పునియా రజత పతకం దక్కించుకున్నాడు. ప్రపంచ చాంపియన్‌షిప్స్ రజత పతక విజేత అయిన దీపక్ పునియా 86 కిలోల ఫ్రీస్టైల్ విభాగంలో ఆదివారం జరిగిన ఫైనల్లో ఒలింపిక్ చాంపియన్ , ఇరాన్‌కు చెందిన హసన్ యాజ్దానీ చేతిలో కేవలం 2 నిమిషాల 53 సెకన్లలో 10 0 పాయింట్ల తేడాతో పరాజయం పాలయి రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. కాగా పోటీల చివరి రోజయిన ఆదివారం మన దేశానికే చెందిన సంజీత్ 92 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించాడు. ఈ పోటీల్లో భారత్ మొత్తం 5 బంగారు, మూడు వెండి, ఆరు కాంస్య పతకాలు సాధించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News