Tuesday, April 30, 2024

పిచ్చెక్కిస్తున్న ఎఐ డీప్ ఫేక్ మాయాజాలం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అందరికీ అందుబాటులోకి వస్తున్న అత్యంత అధునాతన సాంకేతికత ఇప్పుడు దుష్టబుద్ధుల చేతిలో పడి దైనందిన జీవితాలలో చిక్కులకు దారితీస్తున్నాయి. సహజసిద్ధ తెలివికి బదులుగా మారు తెలివి లేదా కృత్రిమ మేధ లేదా ఎఐ పరిజ్ఞానం ఇప్పుడు రెండువైపుల పదునైన కత్తి అయింది. వికృత రీతిలో మానసిక అశాంతిని రగిలిస్తోంది. ఎక్కడో ఉంటారు. ఎవ్వరితోనే పరిచయస్తులుగా మాట్లాడుతారు. తాము అని ఐఎ పరిజ్ఞానంతో నిండా నమ్మిస్తారు. దీనితో తనను పలకరించిన వ్యక్తి తనకు తెలిసిన ఫలానా అని భ్రమించి పలువురు మోసపోతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు డీప్‌ఫేక్ స్కామ్ కూడా వెలుగులోకి వచ్చింది. అసభ్యంగా అశ్లీలంగా ఉన్న యువతుల ఫోటోలను సమాజంలోని పలు రంగాలలో, స్థాయిల్లో చలామణిలో ఉన్న సెలబ్రెటీలుగా మలిచి, ఎఐ ప్రక్రియతో ఫోటోలు మార్ఫింగ్ చేసి జోరుగా తమ దుష్టచర్యలకు పాల్పడే శక్తులు బయలుదేరాయి.

ఇది చివరికి సామాజికంగా ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందనేది తెలియడం లేదు. ఇటీవల సినీనటిమణులు కత్రినా కైఫ్, తరువాత రష్మిక అశ్లీల చిత్రాలు ఈ డీప్ ఫేక్ స్కామ్‌లో అంతర్భాగాలు అయ్యాయి. గుర్తు తెలియని శక్తులు ఓ గ్యాంగ్‌గా మారి పెద్ద ఎత్తున ఈ డీప్‌ఫేక్ వ్యవహారం సాగిస్తున్నారని వెల్లడైంది. ఎవరిని ఎంచుకుంటే వారిని తాము ఈ ఉచ్చులోకి లాగుతామని, ఎవరినైనా మోసగిస్తామని చెప్పి ఈ విధంగా బెట్టింగ్‌లకు కూడా దిగుతూ తెరవెనుక పెద్ద ఎత్తున భారీ గోల్‌మాల్ వ్యవహారం సాగుతోంది. ఇటీవలే కేరళకు చెందిన ఓ వ్యక్తిని ఈ డీప్‌ఫేక్ ప్రక్రియ ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు నమ్మించి మోసగించారు. ఎవరినో మరెవ్వరిగానో చూపించి వారికి అత్యవసరంగా ఉందని తెలిపి డబ్బులు దండుకోవడం, సెలబ్రెటీలను తమ తప్పుడు చిత్రీకరణలతో బ్లాక్‌మొయిల్ చేయడం లేదా ఇదో గేమ్‌గా మల్చుకుని ఆర్థికంగా లావాదేవీలు సాగించడం పరిపాటి అయింది. ఈ క్రమంలో సజావుగా వచ్చే పలు వీడియో కాల్స్‌ను కూడా అపనమ్మకంతో అందుకునే పరిస్థితి ఏర్పడుతోంది. ఇది చివరికి సైకలాజికల్‌గా అందరిని ప్రభావితం చేసే ఓ భారీ కుట్రకు దారితీస్తోందని సామాజికవేత్తలు, పోలీసు వర్గాలు, సైకియాట్రిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News