Monday, April 29, 2024

84 సిక్కు ఊచకోత కేసు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : 1984లో ఢిల్లీలో జరిగిన సిక్కు వ్యతిరేక ఘర్షణల కేసులో కాంగ్రెస్ నేత జగదీష్ టైట్లర్‌కు ఢిల్లీ కోర్టు బుధవారం సమన్లు వెలువరించింది. ఆగస్టు 5వ తేదీన కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. సంబంధిత కేసు ఛార్జీషీట్‌లోని అంశాలకు అనుగుణంగా అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ విధిగుప్తా ఆనంద్ ఈ ఉత్తర్వులు వెలువరించారు. అప్పటి సిక్కుల ఊచకోతకు సంబంధించి మే 20న సిబిఐ టైట్లర్‌పై అభియోగ పత్రం దాఖలు చేసింది. ఇందిరాగాంధీ హత్యానంతరం 1984లో నవంబర్ 1న స్థానిక పల్ బంగాష్ ప్రాంతంలో ఓ గురుద్వారాను గుంపు తగులబెట్టడం, ఈ దవలో ముగ్గురు వ్యక్తుల వధ ఘటనలో జగదీష్ టైట్లర్ ప్రమేయం ఉందని, ఆయన గుంపును దౌర్జన్యానికి పురికొల్పారని సిబిఐ ఛార్జీషీట్‌లో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News