Saturday, May 4, 2024

నిషేధం ఉల్లంఘించి ఢిల్లీలో టపాసుల మోత

- Advertisement -
- Advertisement -

Delhi Diwali Cracker Ban 2022

న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం విధించిన నిషేధం అమలులో ఉన్నప్పటికీ దేశ రాజధాని పౌరులు సోమవారం భారీ శబ్దాలతో బాణసంచా పేల్చి దీపావళి పండుగ జరుపుకున్నారు. దీపావళి నాడు టపాసులు పేలిస్తే ఆరు నెలల జైలు, రూ. 200 జరిమానా విధిస్తామని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ గత వారం హెచ్చరికలు జారీచేసినప్పటికీ ప్రజలు మాత్రం ఏమాత్రం ఖాతరు చేయకుండా పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి పండుగ జరుపుకున్నారు. దక్షిణ, వాయువ్య ఢిల్లీతోపటు నగరంలోని అనేక ప్రాంతాలలో సోమవారం సూర్యాస్తమయం తర్వాత భారీ ఎత్తున బాణసంచా మార్మోగింది. అనుమతికి మించిన శబ్దాలు వచ్చే టపాసులు పేలడంతో అసలు నగరంలో నిషేధం ఉందా అన్న ప్రశ్న పలువురిలో తలెత్తింది. పొరుగు రాష్ట్రాల నుంచి పంట వ్యర్థాల దహనం వల్ల వచ్చే పొగ కాలుష్యం ఇప్పటికే ఢిల్లీ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుండగా ఆపైన దీపావళి టపాసుల వల్ల కలిగే వాయు కాలుష్యంతో వచ్చే అనారోగ్యాల గురించి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గడచిన ఏడేళ్లతో పోలిస్తే ఈ సారి వాయు ప్రమాణ సూచి(ఎక్యుఐ) మెరుగ్గానే ఉందని, 2018లో ఎక్యు 281 ఉండగా ఈ ఏడాది 312 ఉందని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News