Sunday, April 28, 2024

వరద బాధితులపై అధికారుల నిర్లక్ష్యం.. మంత్రి ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : వరదబాధితులకు సాయం అందించడంలో అధికారుల నిర్లక్ష్యంపై ఢిల్లీ రెవెన్యూ శాఖ మంత్రి అతిషి ఆగ్రహం వెలిబుచ్చారు. వరద నివారణ చర్యలు, సాయం పంపినీ విషయంలో పలువురు ఐఎఎస్‌లు వ్యవహరించిన తీరుపై ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేశ్‌కుమార్‌ను మంత్రి అతిషి నిలదీశారు. శని, ఆదివారం సెలవు రోజులైనప్పటికీ అధికారులందరూ వరద ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. సహాయక చర్యలపై సోమవారం సాయంత్రం 6 గంటలకల్లా ముఖ్యమంత్రి, రెవెన్యూశాఖ మంత్రికి నివేదిక ఇవ్వాలన్నారు. ఢిల్లీలో భారీ వర్షాలతోపాటు యమునానది ఉప్పొంగడంతో దాదాపు 4716 కుటుంబాలు సహాయక శిబిరాల్లో తలదాచుకున్నారు. ఒక్కో కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది.

ఆ బాధ్యతను ఆయా జిల్లాల పరిధి లోని కలెక్టర్లకు ఉన్నతాధికారులకు అప్పగించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం రెవెన్యూ మంత్రి అతిషి ఆ శాఖ ముఖ్య కార్యదర్శితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేవలం 197 కుటుంబాలకే వరద సాయం అందినట్టు ఆయన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంత్రి ఆగ్రహం వ్యక్త చేశారు. ప్రజల అవసరాలు తీర్చేందుకే నియమితులైన అధికారులు ఇలా వ్యవహరించడం సరికాదని హెచ్చరించారు. “ రికార్డుల ప్రకారం 4716 వరద బాధిత కుటుంబాలు ఉన్నాయి. ఒక్కో కుటుంబానికి రూ. 10 వేలు ఇవ్వాలని జులై 15న ఆదేశించాం.

19 మంది ఐఎఎస్‌లు, 18 మంది డిఎఎన్‌ఐసీలు , ఆరుగురు డీఎంలు, ఆరుగురు ఏడీఎంలు , ఒక ఎస్‌డిఎం విధుల్లో ఉన్నారు. అంటే ఒక్కొక్కరు 70 కుటుంబాలకు , ప్రభుత్వం సాయం అందించొచ్చు. సెలవులు పోనూ 10 రోజులు పనిచేశారనుకుంటే ఒక్కో రోజు 7 కుటుంబాలతో మాట్లాడి వారికి సాయం అందించొచ్చు. అది కూడా చేయలేక పోతే ఎలా? ఈ తీరును ప్రభుత్వ ఏ విధంగా అర్ధం చేసుకోవాలి ? అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మంత్రి ఘాటుగా లేఖ రాశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News