Saturday, September 23, 2023

దేశంలో బలమైన శక్తిగా తెలంగాణ

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతోంద ని, సంగారెడ్డి జిల్లాలో అభివృద్దిలో దూసుకు పోతుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ ద శాబ్ది త్సవాలను సంగారెడ్డి కలెక్టరేట్‌లో హోం మంత్రి మహమూద్‌అలీ ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టరేట్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అమరుల స్థూపం వద్ద మంత్రి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ శరత్,జిల్లా పరిషత్ చైర్మెన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డిలు బెలూన్లను వదిలారు. తెలంగాణ కోసం అసువులు బాసిన కొండాపూర్ మండలంలోని మల్కాపూర్‌కు చెందిన భార్గవ్ తండ్రి నో ముల సత్యనారాయణను మంత్రి ఘనంగా సత్కరించారు.

పటాన్‌చెరు మండలంలోని చిట్కుల్, కర్దనూర్, రామేశ్వరం, కంది మండలంలోని ఎద్దుమైలారం గ్రామ పంచాయితీలు జిల్లా పంచాయితీ కార్యాలయం హెచ్‌వైఎమ్ ఇం టర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా పొందిన ఐఎస్‌ఓ 9001=2015సర్టిఫికెట్‌లను యా సర్పంచ్‌లతో పాటు చిట్కుల్ సర్పంచ్ నీ లం మధుకు జిల్లా పంచాయితీ అధికారి సురేష మోహన్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్బంగా హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ 9 వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకొని దశాబ్దిలోకి అడుగుపెడుతు న్న తెలంగాణ రాష్ట్రం సిఎం కెసీఆర్ నేతృత్వంలో ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకుందన్నారు. ప్రజా సంక్షేమంలోను అభివృద్దిలో దేవానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆచరిస్తుంటే దేశం అనుసరిస్తుందన్నారు. మానవీయమైన దృక్పథం, నిర్మాణత్మకమైన ఆలోచన దార్శనికమైన ప్రణాళిక రచన,పారదర్శకమైన నరిపాలన వీటన్నింటిని మేలుకలయిక అయిన తెలంగాణ మోడల్ నేడు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మ న్నన్నలు పొందిందన్నారు.

ఆర్థిక మాంద్యం, కరోణ వంటి సంక్షభాలు ఎదురైనప్పటికీ తట్టుకొని తెలంగాణ బలీయమైన ఆర్థిక శక్తిగా నలిబడిందన్నారు. సంక్షభ సమయాలలోను సమర్థవంతంమైన ఆర్థిక నిర్వహణ చేస్తూ ప్రజా సంక్షేమ పథకాలను భారీ ఎత్తున నిరాటంకంగా అమలు చేయడం తెలంగా ణ ప్రభుత్వానికే సాధ్యమైందన్నారు. సిఎం కెసీఆర్ ఆలోచనల వెలుగులో ఆవిష్కృతమైన రైతు బంధు పథకం ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందిందన్నారు. ఒకనాడు రైతులు అప్పుల ఊబిలో కూరుకు పోయి ఆత్మహత్యలు చేసుకుంటుంటే రైతు బంధ పథకం ద్వారా రైతుల హృదయాల్లో ఆశదీపాలను వెలిగించిందని చెప్పారు. రైతు భీమా పథకం రైతుల కుటుంబాలకు ఎనలేని ధీమానిస్తుందన్నారు. విధివశాత్తు రైతు మరణిస్తే మరణించిన నాటి ను ండి 10రోజులలోగా 5లక్షల భీమా సొమ్మును ప్రభుత్వం అతని కుటుంబానికి అందజేస్తుందన్నారు.

జిల్లాలోని మొట్ట ప్రాంతాలను సస్యశామలం చే యడానికి సింగూర్ ప్రాజెక్టుపై సంగమేశ్వర బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం పనులకు 4,427కోట్ల రుపాయల నిధులను మంజూరు చే సిందన్నారు. 3లక్షల 84వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. జి ల్లాలో 444మంది ఎస్‌సి లబ్దిదారులకు దళిత బంధు పథకం ద్వారా ఒక్కొక్కరికి 10లక్షల రుపాయల చొప్పున 44కోట్ల 40లక్షల రుపాయలతో వివిధ కాల పథకాలకు మంజూరు చేశామన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపి బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు మాణిక్‌రావు, క్రాంతి కి రణ్, భూపాల్‌రెడ్డి, తెలంగాణ చేనేత కార్పోరేషన్ చైర్మెన్ చింత ప్రభాకర్,ఎస్ పి రమణకుమార్, డిసిఎంఎస్ చైర్మెన్ శికుమార్, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మెన్ నరహరిరెడ్డి,డిసిసిబి వైస్ చైర్మెన్ పట్నం మా ణిక్యం, మున్సిపల్ చైర్మెన్ బొంగుల విజయలక్ష్మి, వైస్ చైర్మెన్ లత విజేందర్‌రెడ్డి,డిఆర్‌ఓ నగేష్, ఆర్‌డిఓ రవీంద్రారెడ్డి, కౌన్సిలర్‌లు, ఎంపిటిసిలున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News