Tuesday, April 30, 2024

మేడారంకు భారీగా తరలివచ్చిన భక్తులు

- Advertisement -
- Advertisement -

తాడ్వాయి: వన దేవతల దర్శనానికి బుధవారం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. సుదూర ప్రాంతాల నుండి భక్తుల భారీగా తరలిరావడంతో జంపన్న వాగు, స్నానఘట్టాలు, కళ్యాణ కట్ట తదితర ప్రాంతాలు భక్తుల రాకతో సందడిగా మారాయి. పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు తల్లుల దర్శనానికి గద్దెల ప్రాంగణానికి చేరుకోగా వేలాది మంది భక్తులతో గద్దెల ప్రాంగణం జనకలను సంతరించుకుంది.

తల్లుల దర్శనానికి బిజెపి బీజాపూర్ జిల్లా నాయకుడు ఛత్తీస్‌గడ్ మాజీ మంత్రి మహేష్ గడ్గ, బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు లవ్‌కుమార్ రాయుడు, జిలారామ్ రానా, గాసిరాంనాగ్ తదితరులు తల్లులకు మొక్కులు చెల్లించి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఛత్తీస్‌గడ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుండి భక్తులు వేలాదిగా తరలివచ్చి వనదేవతలు సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మేడారం ఆలయ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో సందడిగా మారాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News