Sunday, April 28, 2024

మరియమ్మ కుటుంబానికి డిజిపి పరామర్శ

- Advertisement -
- Advertisement -

E- Pass must for travel in Telangana: DGP Mahendar Reddy

 

పూర్తిస్థాయి విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ

మన తెలంగాణ/ఖమ్మం : తెలంగాణలో కస్టోడియల్ డెత్ సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని రాష్ట్ర పోలీస్ డైరక్టర్ జనరల్ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన యాద్రాద్రి భువనగిరిజిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో ఇటీవల లాకప్‌డెత్ సంఘటనలో మృతి చెందిన మరియమ్మ కుటుంబ సభ్యులను ఆయన ఖమ్మంలో పరామర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అదేశాల మేరకు ఆదివారం ఆయన ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో ఖమ్మంకు చేరుకున్నారు. డిజిపితోపాటు నార్త్ జోన్ ఐజిపి వై నాగిరెడ్డి కూడా జిల్లాకు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆర్ వికర్ణన్, జిల్లా పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ కలిసి ముందుగా నగరంలోని సంకల్ప సి స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరియమ్మ కుమారుడు ఉదయ్‌కిరణ్‌ను పరామర్శించారు.

అడ్డగూడూరు, కొణిజర్ల, చింతకాని పోలీస్ స్టేషన్లో జరిగిన సంఘటన వివరాలను డిజిపి అడిగి తెలుసుకున్నారు. ఉదయ్‌కిరణ్‌ను, మరియమ్మను కొట్టిన వాళ్ళు ఎవ్వరు అనే విషయంపై ఆరా తీశారు. ఈసందర్భంగా బాధితుడు పోలీసులు తనను విక్షచణరహితంగా కొట్టారని రోదిస్తూ చెప్పారు. తన కళ్ళ ముందే తన తల్లిని క్రూరంగా కొట్టారని తన చేతిలోనే తన తల్లి మృతి చెందిందని, తమకు న్యాయం చేయాలని బాధితుడు డిజిపిని కన్నీటితోవేడుకున్నారు. తరువాత అక్కడే ఉన్న మరియమ్మకు చెందిన ఇద్దరు కుమార్తేలను, ఆళ్ళులను కూడా డిజిపి పరామార్శించారు. బాధిత కుటుంబానికి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాల అదుకునేందుకు హామి ఇచ్చిందని, ఇంకా ఎమైనా సహాయం కావాలన్నా చేస్తామని వారికి భరోసా ఇచ్చారు. దాదాపు అర్ధగంట సేపు ఆసుపత్రిలోనే గడిపారు.

ఆ తరువాత పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఆయన మీడియాతోమాట్లాడ్తూ అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ సంఘటనలో ఇప్పటికే ఎస్ ఐ,ఇ ద్దరుకానిస్టేబుళ్ళను సస్పెండ్ చేయడమే కాకుండా చౌటుప్పల్ ఎసిపిని బదిలీ చేశామని, ఈ సంఘటనపై పూర్తి స్థ్ధాయిలో జ్యూడిషియల్ విచారణ కొనసాగుతుందని, విచారణ పూర్తి అయిన తరువాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు. ఎవరు తప్పు చేసినా చర్యలు తప్పవని, దోషులుగా తెలిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. అడ్డగూడూరు తరహ సంఘటనలు ఇకపై ఉపేక్షించేది లేదని, ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు అధికారులపై, సిబ్బందిపై ఉందని ఆయన అన్నారు. తెలంగాణలో విజయవంతంగా అమలవుతున్న సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని, ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినకుండా పోలీసులు వ్యవహరించాలని ఆయన సూచించారు.

నేరాలను అరికట్టేందుకు, నేరస్తులను పట్టుకునేందుకు చేస్తున్న కృషిలో భాగంగానేరస్తుల విచారణ సందర్భంగా జరిగిన అడ్డగూడూరు ఘటన బాధకలిగించిందని, ఇలాంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా, భవిష్యత్తుల జరగకుండా చూస్తామన్నారు. బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన ఆర్థ్ధిక సాయం, ఉద్యోగంపై డిజిపి జిల్లా కలెక్టర్ ఆర్ వికర్ణన్‌తో మాట్లాడారు. సోమవారం నాడు మరియమ్మ కుమారుడికి ఉద్యోగ నియామక ఉత్తర్వుతోపాటు రూ. 35లక్షల ఎక్స్‌గ్రేషియాను కూడా అందజేస్తామని కలెక్టర్ డిజిపికి వివరించారు. ఆ తరువాత డిజిపి కొణిజర్ల పోలీస్ స్టేషన్‌తోపాటు ఖమ్మం రూరల్, ఖమ్మం త్రీటౌన్ పోలీస్ స్టేషన్లతోపాటు పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోని ఎంటి సెక్షన్‌ను అకస్మికంగా తనిఖీ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News