Sunday, April 28, 2024

కీసర లంచం నిందితుడు ధర్మారెడ్డి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Dharma Reddy suicide who victim in Keesara Case

 

కీసర కేసు నిందితుడు ధర్మారెడ్డి ఆత్మహత్య
ఇదే కేసులో మాజీ ఎంఆర్‌వొ నాగరాజు బలన్మరణం

మనతెలంగాణ/హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కీసర మాజీ ఎంఆర్‌వొ నాగరాజు లంచం కేసులో నిందితుడు ధర్మారెడ్డి నగరంలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాసవినగర్‌లో ఆదివారం నాడు చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కీసర మాజీ ఎంఆర్‌వొ నాగరాజు నుంచి నకిలీ పాసు పుస్తకాలు తీసుకున్న కేసులో అరెస్టై 33 రోజుల పాటు జైల్లో ఉన్న ధర్మారెడ్డి ఇటీవల కాలంలో జైలు నుంచి బయటికి వచ్చి ధర్మారెడ్డి జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. కీసర మాజీ తహసీల్దార్ నాగరాజుతో చేతులు కలిపిన ధర్మారెడ్డి జూలై 9న రాంపల్లిలోని పలు సర్వే నంబర్లలో ఉన్న 24 ఎకరాల భూమికి నకిలీ పాసుపుస్తకాలు తీసుకున్నాడు. ఈ కేసులో సెప్టెంబర్ 25న ధర్మారెడ్డిని ఎసిబి అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇదే కేసులో ధర్మారెడ్డి కుమారుడు శ్రీకాంత్ రెడ్డితో పాటు ఎంఆర్‌వొ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్, మరో ముగ్గురు స్థిరాస్తి వ్యాపారులను ఎసిబి అధికారులు సెప్టెంబర్ 29న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.ఇటీవలే ధర్మారెడ్డి కండీషన్ బెయిల్‌పై విడుదలై చంచల్‌గూడ జైలు నుంచి బయటికి వచ్చారు. ఈక్రమంలో రెండు రోజులకు ఒకసారి ఎసిబి కార్యాలయంలో హాజరవుతున్నట్లు ఎసిబి అధికారులు వివరిస్తున్నారు, ఈక్రమంలో ధర్మారెడ్డి ఆదివారం ఉదయం చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఇదిలావుండగా కీసర మాజీ ఎంఆర్‌వొ నాగరాజు గత నెల 14వ తేదీన చంచల్‌గూడ జైల్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. నాగరాజుపై రూ. కోటి 10 లక్షల లంచం తీసుకున్న కేసుతో పాటు నకిలీ పాసుపుస్తకాలు జారీ చేసిన విషయంలో అని అధికారులు కేసు నమోదు చేశారు. ఈ రెండు కేసుల్లోనూ ఎసిబి అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పోలీసులు వేధించారుః మృతుడు ధర్మారెడ్డి భార్య
కీసర మాజీ ఎంఆర్‌వొ నాగరాజు కేసులో తన భర్తను పోలీసులు వేధించారని ఆత్మహత్య చేసుకున్న ధర్మారెడ్డి భార్య వెంకటమ్మ ఆరోపించారు. ఈ సందర్భంగా మృతుడి భార్య మాట్లాడుతూ భూ వివాదంలో నా భర్తను అన్యాయంగా అరెస్ట్‌చేశారని ఆరోపణలు చేసింది. అసలు నాగరాజుకు, నా భర్తకు సంబంధం లేదు. మా ఇంట్లో సోదాల్లో ఎలాంటి పాస్‌బుక్‌దొరకలేదని వివరించింది. ఈక్రమంలో జైలు నుంచి బయటకు వచ్చాక నా భర్త తీవ్ర మనస్తాపం చెందాడని, బెయిల్‌పైన వచ్చాక కూడా రోజు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి సంతకాలు పెట్టాలని పోలీసులు వేధించారని వాపోయింది. నా భర్తను కలిసి బయటకి వచ్చిన తర్వాత రోజు నాగరాజు జైలులో ఆత్మహత్య చేసుకున్నట్లు వార్త విన్నాం. ఓ వైపు పోలీసుల వేధింపులు, మరోవైపు భవిష్యత్‌లో ఏమవుతుందో అనే భయంతోనే నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడని అని ఆవేదన వ్యక్తం చేసింది. ధర్మారెడ్డి కుమార్తెలు మాట్లాడుతూ ‘మా నాన్నపై కక్ష కట్టి కేసులు పెట్టారు. జైలు నుంచి బయటకి వచ్చాక మనస్తాపం చెందాడు. తన మర్యాద మొత్తం పోయిందని బాధపడ్డాడు. కందాడి భూపాల్‌రెడ్డి, లక్ష్మారెడ్డితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు మా నాన్నపై ఫిర్యాదు చేయడంతో ఎసిబి, విజిలెన్స్‌అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి కేసు పెట్టించారన్నారు. నాగరాజుకు మా నాన్నకు పెద్ద పరిచయం కూడా లేదని, జైలు నుంచి వచ్చాక నేను ఎందుకు బతకాలి చనిపోతా అంటూ ఆవేదన వ్యక్తం చేశాడన్నారు. శనివారం నాడు ఇంటి నుంచి బయటకు వెళ్లి మా నాన్న తిరిగి రాలేదని, ఆదివారం ఉదయం చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు. ఇదే కేసులో అరెస్ట్ అయిన ధర్మారెడ్డి కుమారుడు శ్రీధర్ రెడ్డికి బెయిల్‌లభించకపోవడంతో జైలులోనే ఉన్నాడు. ధర్మారెడ్డి మృతదేహానికి శవ పరీక్ష పూర్తి కావడంతో అసిస్టెంట్ దాక్టర్ లావణ్య మరియు 5దు గురు పిఇ డాక్టర్స్ బృందం పోస్ట్‌మార్టం నిర్వహించింది. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
మొన్న ఎంఆర్‌వొ భర్త, నిన్న మాజీ ఎంఆర్‌వొ, నేడు ధర్మారెడ్డి: 
ఎసిబికి పట్టుబడటంతో అవమానం భరించలేక ఇటీవల షేక్‌పేట్ ఎంఆర్‌వొ భర్త ఆత్మహత్య చేసుకోగా, ఒకే కేసులోని నిందితులు నాగరాజు, ధర్మారెడ్డిలు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. షేక్‌పేట్ కేసులో భాగంగా తహసీల్దార్ సుజాత ఇంట్లో తనిఖీ చేయగా 30 లక్షల నగదు, బంగారు ఆభరణాలు లభ్యమైన విషయం తెలిసిందే. వీరితో పాటు బంజారాహిల్స్ ఎస్‌ఐ రవీందర్‌ను ఎసిబి అధికారులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా సుజాత భర్త అజయ్ కుమార్‌ను విచారించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆరట్స్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఆయన జూన్ 17న ఉదయం చిక్కడపల్లిలోని తన చెల్లెలి ఇంటికి వెళ్లి ఐదు అంతస్తుల భవనం మీది నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని అజయ్ కుమార్ సోదరి ఆరోపించారు. అలాగే కీసర కేసులో ప్రధాన నిందితుడు నాగరాజు అక్టోబర్ 14 న జైలులోని కిటికి గ్రిల్‌కు టవల్‌తో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది. తన భర్త ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని నాగరాజు భార్య అన్నారు. ఉన్నత స్థాయి విచారణ జరపాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. తాజాగా ఈ కేసులో అరెస్టై, బెయిల్ పై బయటికొచ్చిన ధర్మారెడ్డి సైతం ఆత్మహత్య చేసుకున్నాడు. కుషాయిగూడ పిఎస్ పరిధిలోని వాసవినగర్‌లో చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణం చెందాడు. ఈక్రమంలో ఎసిబి కేసుల్లో నిందితులుగా ఉన్న వారు వరుస ఆత్యహత్యలకు పాల్పడటం ప్రస్తుతం చర్చనీయాశంగా మారింది.

Dharma Reddy suicide who victim in Keesara Case

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News