Monday, April 29, 2024

మెట్రో సేవల్లో హైదరాబాద్ మెట్రోకు రెండో స్థానం

- Advertisement -
- Advertisement -

Hyderabad Metro is second in metro services

హైదరాబాద్: మహానగరానికి మణిహారంగా నిలిచి మెట్రోకు ప్రయాణికుల ఆదరణ పెరుతున్నట్లు మెట్రో అధికారులు పేర్కొంటున్నారు. లాక్‌డౌన్ తరువాత దేశంలో ముందుగా డిల్లీ మెట్రో సేవలు ప్రారంభించింది. తరువాత ఇతర నగరాల్లో ప్రారంభించగా అందులో డిల్లీ మెట్రో తరువాత హైదరాబాద్ మెట్రో చాలా మెరుగ్గు పనిచేస్తోందన్నారు. దేశంలో పది నగరాల్లో మెట్రో సేవలంస్తుండగా అందులో మన మెట్రో రెండస్దానంలో ఉందని, రోజుకు 69కిమీ పరిధిలోని మూడు కారిడార్లలో 1,33,974మంది రాకపోకలు సాగిస్తున్నట్లు వెల్లడించారు. 3ఏళ్లలో ఎంతో పుంజుకుని ప్రయాణికులను వివిధ స్దానాలకు చేరవేస్తుందన్నారు. అతి తక్కువ కాలంలో ఆస్దాయిలో ఆదరణ పొందిన మెట్రోల్లో హైదరాబాద్ మెట్రోకు ప్రత్యేక స్దానముందన్నారు. రానున్న రోజుల్లో మెట్రోకు వెళ్లేందుకు జనం మొగ్గు చూపుతారని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల ప్రకటించిన సువర్ ఆఫర్‌తో మెట్రో స్టేషన్లలో రద్దీ పెరిగినట్లు సిబ్బంది పేర్కొంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News