Tuesday, April 30, 2024

మైన్ పురి లోక్ సభ స్థానానికి డింపుల్ యాదవ్ నామినేషన్

- Advertisement -
- Advertisement -

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ప్రతిష్టాత్మక మైన్‌పురి లోక్‌సభ ఉప ఎన్నికలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా డింపుల్ యాదవ్ సోమవారం నామినేషన్ వేశారు. 44 ఏళ్ల డింపుల్ యాదవ్ నామినేషన్ వేసినప్పుడు ఆమె భర్త, సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా ఆమె వెంట ఉన్నారు. ములాయం సింగ్ యాదవ్ గత అక్టోబర్ 10వ తేదీన కన్నుమూయడంతో మైన్‌పురి నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ డిసెంబర్ 5న పోలింగ్ జరుగనుండగా, డిసెంబర్ 8న ఫలితాలు ప్రకటిస్తారు. నామినేషన్ల ప్రక్రియ నవంబర్ 17వ తేదీ వరకూ కొనసాగనుంది.

మైన్‌పురి పార్లమెంటరీ నియోజకవర్గంలో మైన్‌పురి, భోగావ్, కిష్ని, కర్హాల్, జస్వంత్ నగర్‌ అనే 5 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ కర్హాల్, కిష్ని, జస్వంత్ నగర్ స్థానాల్లో గెలుపొందగా, మైన్‌పురి, భోగావ్ నియోజకవర్గాల్లో బిజెపి గెలిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News