Tuesday, April 30, 2024

రేణుక పూనింది రోగాలు నయం చేస్తా…

- Advertisement -
- Advertisement -

వరంగల్ సుబేదారిలో ఓ కుటుంబం నుంచి నగలు, నగదు కాజేసిన మహిళ, మరో నిందితుడు

 

మన తెలంగాణ/వరంగల్ క్రైం: పూజలతో రోగాల్ని బాగు చే స్తానని నమ్మించి దంపతులను నిర్భందించి బంగారు ఆభరణాలు, డబ్బును దోచుకున్న కిలాడీ మహిళతో పాటు మరో నిందితుడిని గురువారం సిసిఎస్, సుబేదారి పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఇద్దరు నిందితుల నుంచి పోలీసులు రూ. 23 లక్షల 69వేల నగదుతో పాటు రూ.6 లక్షల విలువగ 147గ్రాముల బంగారు ఆభరణాలను స్వా ధీనం చేసుకున్నారు. ఈ నిందితుల అరెస్ట్‌కు సంబంధించి వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ్ రవీందర్ వెల్లడించారు. పోలీసులు అరెస్ట్ చేసిన కిలాడీ మ హిళ పద్మ వృత్తిరీత్యా ఇండ్లలో పనిమనిషిగా చేస్తూ జీవనం కొనసాగిస్తోంది. తద్వారా వచ్చే ఆదాయం త న అవసరాలకు సరిపోకపోవడం తో నిందితురాలు తమ మకాంను తన స్వగ్రామం నుంచి సుబేదారిలో ని జులైవాడకు మార్చి కొద్దికాలం గా ఇదే ప్రాంతంలో ఇండ్లలో పనిచేస్తుండేది.

ఇదే సమయంలో ఇంటి యజమానుల ఇంటి సమస్యలు, వారి ఆరోగ్యాలను క్షుణ్ణంగా పరిశీలించిన కిలాడీ లేడీ అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలనే ఆలోచనకు తెరతీసిందని, ఇందులో భాగంగా నిందితురాలు జులైవాడలో తాను పనిచేసే ఇంటి యజమాని ఇంటిలో పనిచేసే మరో నిందితుడు రాజబాబుతో పరిచయం కావడంతో ఇతని సహకారంతో నిందితురాలు పద్మ తన ఒంటమీదకు రేణుకా అమ్మవారు వస్తుందని, రోగాలు నయం చేస్తానని, తాను పనిచేసే ఇంటి యజమానులు నమ్మించి డబ్బు కాజేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సిపి తెలిపారు. ఇందులో భాగంగా జులైవాడలో నివాసం ఉంటున్న బాధితులు వెంకటస్వామి, అన్నపూర్ణ దంపతుల వద్ద నిందితురాలు పద్మ గత సంవత్సరం 2017 అక్టోబర్ మాసం నుంచి నమ్మకంగా పనిచేస్తూనే తన ఒంటిపైకి రేణుకమాత వస్తుందని, రోగాలు యనం చేస్తానని ఆ దంపతులకు చెప్పింది. బాధితుల మనుమడికి ఆరోగ్య సమస్యలు ఉండడంతో నిందితురాలు ఆ బాలుడి ఆరోగ్యాన్ని బాగుచేస్తానని, ఇందుకుగాను రూ.4 లక్షలు ఖర్చు అవుతుందని బాధితులను నమ్మించింది. దీంతో పద్మ, రాజబాబులకు బాధిత దంపతులు 2018 సంవతసరంలో అక్టోబర్ మాసంలో రూ.4 లక్షలు ఇచ్చారు. ఇదే సమయంలో బాలుడికి ఆస్పత్రిలో సరైన చికిత్స చేయడం ద్వారా ఆరోగ్యం కుదుట పడడంతో నిందితురాలు తన మహిమతోనే బాలుడి ఆరోగ్యం కుదుటపడినట్లుగా తెలపడంతో పద్మకు బాధిత కుటుంబసభ్యులతో మరింత సాన్నిహిత్యం పెరిగింది.

ఈ విధంగా నిందితురాలు పద్మ ఉపాధ్యాయుడు వెంకటస్వామి దంపతులకు ప్రాణభయం ఉందని, వీరి కొడుకుకు చేత బడి చేశారని, బాధితుడు వెంకటస్వామి గుండె జబ్బు రావడంతో గుండె జబ్బు నయం చేస్తానని, లేకుంటే చనిపోతారని పూజలు చేసేందుకు రూ.25 లక్షల వరకు ఖర్చుఅవుతుందని, ఆరోగ్యం కుదుట పడ్డాక డబ్బు ఇవ్వాలని నిందితురాలు బాధితుడి భార్య అన్నపూర్ణకు తెలిపింది. 2019 జనవరి 6వ తేదీన బాధితుల ఇంటికి వచ్చి విదేశాల్లో ఉంటున్న మీకూమారుడికి ప్రాణ గండం ఉందని రూ.2 కోట్లు ఇస్తే దేవతా పూజలు చేసి ప్రాణగండం తప్పిస్తామని బాధిత దంపతులను నిందితులు బెదిరించడంతో తమ డబ్బు తమకు తిరిగి ఇవ్వమని నిందితులను నిలదీయడంతో నిందితులిద్దరు బాధిత దంపతులను తాళ్లతో కట్టి వారిని అదే ఇంటిలో నిర్భంధించి నిందితులిద్దరు అక్కడి నుండి వెళ్లిపోయారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో సుబేదారి పోలీసులు నిందితులు పద్మ, రాజబాబులపై కేసు నమోదు చేయడంతో రంగంలోకి దిగిన సిసిఎస్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని సుబేదారి పోలీసులతో కలిసి ఇద్దరు నిందితులను పట్టుకొని వారి నుంచి నగదు, బంగారు ఆభరణాలు, దస్తావేజులు, చెక్కులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఈస్ట్‌జోన్ డిసిపి కెఆర్ నాగరాజు, క్రైం ఎసిపి బాబురావు, సిసిఎస్, సుబేదారి ఇన్స్‌పెక్టర్లు రమేష్‌కుమార్, అజయ్, సిసిఎస్, ఎస్‌ఐ బివిఎస్ రావు, ఎఎస్‌ఐలు శివకుమార్, పర్విన్, హెడ్‌కానిస్టేబుళ్లు, అహ్మద్‌పాషా, దామోదర్, జంపయ్య కానిస్టేబుళ్లు రాజశేఖర్, సౌభౌగ్య, సంధ్యారాణిలను సిపి రవీందర్ అభినందించారు.

 

Diseases remove with wizard in Telangana
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News