Monday, April 29, 2024

సమత కేసులో ముగ్గురికీ ఉరిశిక్ష

- Advertisement -
- Advertisement -

రూ.26వేలు జరిమానా
66 రోజుల్లో వెలువడిన ఆదిలాబాద్ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు

 Samatha Case

 

మన తెలంగాణ/అసిఫాబాద్ ప్రతినిధి(హైదరాబాద్): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సమత హత్యాచారం కేసులో ముగ్గురు నిందితులు షేక్‌బాబు, షేక్ షాబుద్దీన్, షే క్ ముఖ్దూంలు దోషులుగా తేలడంతో ప్రత్యేక న్యాయస్థానం వారికి ఉరిశిక్షతో పాటు రూ. 26వేల జరిమానా విధిస్తూ గు రువారం ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి తుదితీ ర్పు ఇచ్చారు. సమత కేసులో ఎ1 షేక్‌బాబు(30), ఎ2 షేక్ షాబుద్దీన్(40), ఎ3 షేక్ ముఖ్ద్దూం(30) దోషులపై నేరం రు జువైనందుకు 302 ఐపిసి ప్రకారం మరణ శిక్ష, 376 ప్ర కారం యావజ్జీవ కారాగార శిక్ష, ఎస్‌సి, ఎస్‌టి చట్టం క్రింద 3 సంవత్సరాల జైలు శిక్ష , జరిమాన, మృతురాలి సెల్‌ఫోన్, రూ.200 నగదును దొంగిలించినందుకు రూ. 26వేల జరిమానా విధిస్తూ ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో తీర్పు  వెల్లడించే ముందు నిందితులకు మీపై మోపిన నేరం రుజువైందని న్యా యమూర్తి తెలిపారు. మీరు ఏమైనా చెప్పుకునేది ఉందా? అని నిందితుల ను న్యాయమూర్తి అడిగారు. దీంతో ప్రధాన నిందితుడు షేక్ బాబు కంటతడి పెట్టాడు. మా కుటుంబాలకు తామే పెద్ద దిక్కని ముగ్గురు నిందితు లు కోర్టు హాలులో బోరున విలపించారు. తీర్పు నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టుకు సమత కుటుంబీకులు, గ్రామస్తులు చేరుకున్నారు. సమత స్వగ్రామం గోనంపల్లె వాసులు సైతం సమత కేసులో తు ది తీర్పును తెలుసుకునేందుకు కోర్టుకు భారీగా చేరుకున్నారు. దీంతో కో ర్టు వద్దకు భారీ సంఖ్యలో జనాలు చేరుకోవడంతో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. దోషులకు కోర్టు ఉరిశిక్ష విధించడంతో సమత కుటుంబ సభ్యులకు న్యాయం జరిగిందని వివిధ సంఘాల నాయకులు, మహిళ సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు అనందం వ్యక్తం చేశా రు.ఇదిలాఉండగా ఈ కేసులో ఈనెల 20న వాదనలు పూర్తయ్యాయి. కాగా ఈనెల 27న ప్రత్యేక కోర్టు తీర్పువెలువరించాల్సి ఉన్నప్పటికీ న్యాయమూర్తి అనారోగ్యం కారణంగా ఈనెల 30కి వాయిదా వేశారు.

సమత కేసు వివరాలు

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామానికి చెందిన టేకు గోపి కుటుంబం తమ జీవనోపాధి కోసం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలానికి గత 5 సంవత్సరాల క్రితం వలన వచ్చి ఇక్కడే జీవనం సాగిస్తున్నారు. సమత, ఆమె భర్త గోపి ఇద్దరు సమీప గ్రామాలు తిరుగుతూ చిన్న చిన్న వస్తువులు అమ్ముకోని జీవనం సాగించుకునేవారు. ఎప్పటిలాగే గోపి తమ భార్యను తీసుకోని నవంబర్ 24న ద్విచక్రవాహానంపై లింగాపూర్ మండలం ఎల్లాపటార్ గ్రామంలో వదిలిపెట్టి తాను పక్క గ్రామానికి వెళ్లారు. సమత ఎల్లాపటార్ గ్రామంలో వస్తువులు అమ్ముకొని తిరిగి పక్కా గ్రామం అయిన రామ్‌నాయక్ తాండా గ్రా మ శివారులోని జాదవ్ జ్ఞానేశ్వర్ పొలం వద్దకు రాగానే రోడ్డు పక్కకు నెట్టేసి ముగ్గురు నిందితుల్లో చిన్నవాడైన షేక్‌బాబు (30) తొలుత బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించడంతో తర్వాత సమీపంలోని పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. ఇందుకు మిగిలిన ఇద్దరు నిందితులు సహకరించారు. బాధితురాలి కాళ్లు, చేతులు కదలకుండా పట్టుకున్నారు. తర్వాత మిగిలిన ఇద్దరూ అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం బాధితురాలు తమ విషయం బయటికి చెబుతుందేమోనని అనుమానం వారిలో మొదలైంది. ఒక వేళ అదే జరిగితే క్రిమినల్ కేసు నమోదు అవుతుందని భావించిన ఆ ముగ్గురూ ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. దీంతో షేక్ షాబుద్దిన్, షేక్ ముఖ్దూం ఆమె చేతులు, కాళ్లను గట్టిగా పట్టుకోగా షేక్ బాబు తన వెంట తెచ్చుకు న్న కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత ఆమె గొంతు కోయడంతో తీవ్ర రక్తస్రావంతో సమత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమె చనిపోయింది అని నిర్ధారించుకున్న నిందితులు ఆమె వద్ద ఉన్న రూ. 200 తీసుకుని పారిపోయారు. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత ముగ్గురు నిందితులను పోలీసులు ఆసిఫాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.

కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు

సమత హత్యాచారం కేసులో నిందితులు కోళ్లను కోసే కత్తి ని ఉపయోగించారని, కత్తి పొడవు 29 సెంటిమీటర్లు అని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. నిందితుల క్రూరత్వం గురించి పోలీసులు సాక్ష్యాధారాలతో సహా ఆదిలాబాద్లోని ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో మొత్తం 96 పేజీల నివేదికను సమర్పించారు. 44 మంది సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేయడంతో పాటు శాస్త్రీయ ఆధారాలతో కూడిన ఫోరెన్సిక్, డిఎన్‌ఎ నివేదికలను పొందుపరిచారు. 96 పేజీల నివేదికలో 13 పేజీలు ఛార్జిషీట్ కాగా, మిగతా పేజీల్లో సాక్షుల వాంగ్ములాలు, ఫొరెన్సిక్ నివేదికలు, పంచనామా వివరాలు కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో -నిందితులు ముగ్గురు హత్యాచారం సమయంలో వేసుకున్న దుస్తులు, వాడిన కత్తి, మృతురాలి మొబైల్ ఫోన్, రూ. 200 నగదును న్యాయస్థానానికి సమర్పించారు.-నిందితుల దుస్తులపై ఉన్న రక్తపు మరకల నమూనాలు, బాధితురాలు ధరించిన చీరతో పాటు నిందితుల లోదుస్తులకు అంటిన వీర్యకణాన్ని ధ్రువీకరించే ఫొరెన్సిక్ నివేదికను సకాలంలో అందజేశారు. -ఘటనాస్థలం నుంచి సేకరించిన బాధితురాలి చీరపై ఉన్న వీర్యకణాలు, నిందితుల రక్తపు నమూనాలతో సరిపోల్చే డిఎన్‌ఎ నివేదికలను పోలీసులు కోర్టుకు సమర్పించారు.

దోషుల కంట కన్నీరు

సమత కేసులో తీర్పు వెలువరించే క్రమంలో ఎవరికైనా, ఏమైనా చెప్పుకునేది ఉందా అని దోషులను న్యాయమూర్తి కోరారు. వారిపై నేరం రుజువైందని న్యాయమూర్తి తెలిపారు. ఈక్రమంలో దోషి షేక్‌బాబు న్యాయమూర్తి ఎదుట తనకు వృద్ధులైన తల్లిదండ్రులున్నారని, వారిని చూసుకునే బాధ్యత తనపై ఉందని కంటతడి పెట్టాడు.అలాగే తనకు చిన్న పిల్లులు కూడా ఉన్నారని వేడుకున్నాడు. మిగతా నిందితులు సైతం తమను క్ష మించాలని కోరారు. అనంతరం ముగ్గురు దోషులకు మరణ శిక్ష విధిస్తూ న్యాయస్థానం తుది తీర్పును వెల్లడించింది. దోషులు చేసిన నేరం రుజువు కావడంతో ఉరిశిక్షను విధించామని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

బార్ అసోషియేషన్ నిర్ణయం మేరకే వాదించా : లాయర్ రహీం

ఫాస్ట్‌ట్ట్ట్రాక్ కోర్టులో విచారణ ప్రారంభమైన నేపథ్యంలో నిందితుల తరపున వాదించేందుకు న్యాయవాదులు ఎవరూ ముందుకు రాకపోవడంతో కోర్టు జోక్యం చేసుకుని జిల్లా న్యాయసేవాధికార సంస్థ నుంచి నిందితుల తరపున వాదించడానికి కోర్టు న్యాయవాదిని నియమించింది. దీంతో సీనియర్ న్యాయవాది ఎ.ఎ. రహీం నిందితుల తరపున వాదించారు. నిందితుల తరపున వాదించొద్దని బార్ అసోసియేషన్ తీర్మానించినప్పటికీ కోర్టు ఆదేశాల మేరకు అంగీకరించాల్సి వచ్చిందని రహీం పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News