Wednesday, November 6, 2024

మజ్లిస్‌కు డిఎంకె ఆహ్వానం..

- Advertisement -
- Advertisement -

మజ్లిస్‌కు డిఎంకె ఆహ్వానం
తమిళనాడులో 6న జరిగే మహానాడుకు రావాలని పిలుపు

మనతెలంగాణ/హైదరాబాద్: మజ్లిస్ అధినేత, పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీకి తమిళనాడు నుంచి ఆహ్వానం అందింది. తమిళనాడులోని పెరంబూర్ నగరంలో నిర్వహించనున్న డిఎంకె మహానాడుకు హాజరు కావాలని ఆ పార్టీ ఆహ్వానం పంపింది. స్థానిక రాయపేట వైఎంసిఏ మైదానంలో ఈనెల 6వ తేదీన డిఎంకె ఆధ్వర్యంలో ‘హృదయాలను కలుపుదాం’ పేరిట మహానాడును తలపెట్టింది. ఈ మహానాడుకు పాల్గొనేందుకు అఖిల భారత మజ్లిస్ ఈ ఇడిహదుల్ ముస్లిం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీని డిఎంకె మైనార్టీ సంక్షేమ విభాగం రాష్ట్ర కార్యదర్శి మస్తాన్ కలిసి ఆహ్వానం పలికారు. దీనికి ఓవైసీ కూడా అంగీకరించినట్టు డిఎంకె వర్గాలు తెలిపాయి. ఇటీవల బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓవైసీ నేతృత్వంలోని మజ్లిస్ పార్టీ పోటీ చేసి 5 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు దక్షిణాదికే పరిమితమైన మజ్లిస్ పార్టీ తొలిసారిగా ఉత్తరాదిన కూడా సత్తా చాటింది. కాగా, డిఎంకె ఏర్పాటు చేసే కూటమిలో చేరేందుకు ఆసక్తి ఉన్నట్టు ఇటీవల ఓవైసీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో డిఎంకె మహానాడులో ఓవైసీ పాల్గొనడం ఆసక్తి కలిగిస్తోంది.

DMK Invitation to Asaduddin Owaisi for Mahanadu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News