Monday, May 6, 2024

పది పరీక్షలపై వదంతులను నమ్మొద్దు

- Advertisement -
- Advertisement -

 

ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : పదవ తరగతి పరీక్షలపై ప్రభుత్వ నిర్ణయం వచ్చే వరకు ఎలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ.సత్యనారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షల నిర్వాహణపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ విధి విధానాలను త్వరలో హైకోర్టుకు సమర్పించి అనంతరం కోర్టు ఆదేశాల మేరకు పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పది పరీక్షల షెడ్యూల్ పేరుతో సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని కోరారు.

5 వేల కేంద్రాల ఏర్పాటు

రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలను నిర్వహించేందుకు అవసరమైన అదనపు కేంద్రాల ఏర్పాటుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం ఉన్న 2,500 కేంద్రాలకు అదనంగా మరో 2,500 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే ఇప్పటివరకు 5.65 లక్షల మంది విద్యార్థులకు 30వేల గదుల్లో పరీక్షలు నిర్వహించగా, ఇకపై 60వేల గదులు అవసరమని అంచనా వేసింది. ఇప్పటివరకు 30 మంది విద్యార్థులు పరీక్షలు రాసిన ఇప్పుడు ఒక్కో గదిలో బేంచికి ఒకరు చొప్పుడు 10 నుంచి 15 మందిలోపే పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేయాలని ఇదివరకే డిఇఒలకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ ఆదేశించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News