Monday, May 6, 2024

ఏడేళ్ల స్టాండింగ్ నిబంధన తొలగించి న్యాయవాదులకు ఆర్థిక సహాయం అందించాలి

- Advertisement -
- Advertisement -

 

తెలంగాణ అడ్వకేట్ జెఎసి కన్వీనర్ పులిగారి గోవర్థన్‌రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : ఏడు సంవత్సరాల స్టాండింగ్ నిబంధనను తొలగించి ఆర్థికంగా వెనుకబడిన న్యాయవాదులకు ఆర్థిక సహాయం అందించాలని తెలంగాణ అడ్వకేట్ జెఎసి కన్వీనర్ పులిగారి గోవర్ధన్‌రెడ్డి కోరారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పినట్లుగా ధర్మంగా న్యాయవాదులను ఆర్థికంగా ఆదుకోవాలని వ్యాఖ్యానించారు. ఏడు సంవత్సరాల ప్రాక్టీస్ నిబంధనను తొలగించి, ప్రస్తుత పరిస్థితులను పరిశీలించి ఇబ్బందుల్లో ఉన్న న్యాయవాదులను ఆదుకునే విధంగా కమిటీ సభ్యులు స్పందించి సిఎం చెప్పినట్లుగా సహాయం అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏడేళ్లు పైబడిన ప్రాక్టీస్ ఉండాలనే నిబంధన కోర్టుల్లో ఏదైనా నియామకాలకు వర్తిస్తుందని కానీ ప్రస్తుత కరోనా లాక్‌డౌన్ సమయంలో ఆ నిబంధన పెట్టడం సమంజసం కాదని పేర్కొన్నారు.

సిఎం కెసిఆర్ తెలంగాణ ఉద్యమ సమయం నుంచే తెలంగాణ న్యాయవాదులతో సన్నిహితంగా ఉన్నారని, ఆయనకు న్యాయవాదుల స్థితిగతులపై సంపూర్ణ అవగాహన ఉందన్నారు. గౌరవ ప్రదమైన వృత్తిలో ఉన్న న్యాయవాదులు తమ స్థితిగతులను బహిర్గతపరుచుకోలేరని వ్యాఖ్యానించారు. సిఎం కెసిఆర్ ధర్మంగా న్యాయవాదులకు ఆర్థిక సహాయం అందాలని అన్నారు గానీ, ఎన్ని సంవత్సరాల ప్రాక్టీస్ నిబంధన పెట్టాలని ప్రస్తావించలేదని గుర్తు చేశారు.ఏడు సంవత్సరాల ప్రాక్టీస్ నిబంధన వల్ల ముఖ్యమంత్రి ఏ ఉద్దేశంతో న్యాయవాదులకు ఆర్థిక సహాయం అందించేందుకు రూ.25 కోట్లు ఇచ్చారో అది అసంపూర్తిగా మిగిలిపోతుందని అభిప్రాయపడ్డారు. ఏడేళ్ల నిబంధన వల్ల న్యాయవాదుల మధ్య సీనియర్, జూనియర్ అనే అనారోగ్య వాతావరణ ఏర్పడుతుందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News