Friday, April 26, 2024

ఆర్యన్ వచ్చేదాకా ఇంట్లో స్వీట్లు వండొద్దు

- Advertisement -
- Advertisement -

Do not cook sweets at home until Aryan arrives

సిబ్బందికి గౌరీఖాన్ ఆదేశాలు

ముంబయి: బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన అతడికి ఇంకా బెయిల్ లభించలేదు. ప్రస్తుతం ఆర్యన్ ఆర్థర్ రోడ్‌లోని సెంట్రల్ జైలులో ఉన్నాడు. కొడుకు జైల్లో ఉండటంతో షారూక్ కుటుంబం ఆవేదనలో ఉంది. అతడికి త్వరగా బెయిల్ రావాలని తల్లి గౌరీఖాన్ దినదినం పూజలు స్తున్నారట. అదే విధంగా ఆర్యన్ తిరిగొచ్చేదాకా ఇంట్లో స్వీట్లు వండొద్దని సిబ్బందిని ఆమె ఆదేశించినట్లు సమాచారం. ఇటీవల షారూక్ నివాసం మన్నత్‌లో మధ్యాహ్న భోజనం కోసం వంట సిద్ధం చేస్తున్న సిబ్బంది ఖీర్ వండారు. దీన్ని గుర్తించిన గౌరీ వెంటనే కిచెన్‌లోకి వెళ్లి దాన్ని ఆపేయాలని వంట మనుషులకు చెప్పారట. ఆర్యన్ బెయిల్‌పై విడుదలై ఇంటికి వచ్చేవరకు మన్నత్ కిచెన్‌లో ఎలాంటి స్వీట్లు వండటానికి వీల్లేదని గౌరీ ఆదేశించినట్లు షారూక్ సిబ్బంది ఒకరు మీడియాకు తెలిపారు. సాధారణంగా పండగ రోజుల్లో మన్నత్ వేడుకలతో కళకళలాడిపోయేది. ఆర్యన్ జైల్లో ఉండటంతో షారూక్ కుటుంబం ఈ వేడుకలకు దూరంగా ఉంది. డ్రగ్స్ కేసులో అరెస్టయిన ఆర్యన్ బెయిల్ పిటిషన్‌పై ముంబయిలోని ప్రత్యేక న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. అక్టోబరు 20న తీర్పు వెల్లడించే అవకాశాలున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News