Thursday, May 16, 2024

గుర్తింపు లేని పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించొద్దు

- Advertisement -
- Advertisement -

కేసముద్రం : గుర్తింపు లేని పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించి తల్లిదండ్రులు ఇబ్బందులు పడవద్దని కేసముద్రం మండల విద్యాధికారి దబ్బగట్ల శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. మండల వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలతో పాటు 11 ప్రైవేటు పాఠశాలలకు మాత్రమే అనుమతి ఉందని ఆమె స్పష్టం చేశారు. గుర్తింపు లేని పాఠశాలల్లో విద్యార్థులను చేరిస్తే వారి భవిష్యత్తు నాశనం అవుతుందని తెలియజేస్తూనే అటువంటి విషయాలలో విద్యాశాఖ బాధ్యత వహించదని అన్నారు.

ఉప్పరపల్లిలో లాల్‌బహదూర్ స్కూల్, కేసముద్రం స్టేషన్‌లో సమత మాడ్రన్ హైస్కూల్, వివేకానంద విద్యాలయం హైస్కూల్, లేపాక్షి హైస్కూల్, అమీనాపురం లిటిల్ సిటిజన్స్ స్కూల్, కృషి విద్యానికేతన్ హైస్కూల్, ధన్నసరిలో సెయింట్ జాన్స్ హైస్కూల్, కేసముద్రం విలేజ్‌లో వివేకవర్ధిని విద్యాలయం, ఇనుగుర్తిలో విజ్ఞాన్ హైస్కూల్, వాగ్దేవి కాన్సెప్ట్ స్కూల్, పెనుగొండలో సాక్రెడ్ హార్ట్ స్కూల్స్‌కు మాత్రమే అనుమతి ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News