Wednesday, May 22, 2024

కొవిడ్ రోగుల ఇళ్లకు పోస్టర్లు అంటించొద్దు

- Advertisement -
- Advertisement -

Do not paste posters in homes of Covid patients

 

సుప్రీం కోర్టు ఆదేశం

న్యూఢిల్లీ : దేశంలో కరోనా బాధితుల ఇళ్ల బయట పోస్టర్లు అంటించే విధానం ఇప్పుడు అవసరం లేదని, సుప్రీం కోర్టు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు స్పష్టం చేసింది. అయితే ప్రత్యేక కేసుల్లో మాత్రం విపత్తు నిర్వహణ చట్టం కింద అధికారిక ఆదేశాలు జారీ అయితే అప్పుడు పోస్టర్లు అంటించ వచ్చని వెల్లడించింది. దేశ వ్యాప్తంగా కొవిడ్ మార్గదర్శకాలు ఒకే విధంగా ఉండేలా ఆదేశాలివ్వాలని కరోనా బాధితుల ఇళ్ల బయట పోస్టర్లు అంటించే విధానాన్ని తొలగించాలని కోరుతూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌పై ఈ నెల 3 న విచారణ జరిపినప్పటికీ తీర్పును కోర్టు రిజర్వులో పెట్టింది. తాజాగా పోస్టర్లు అంటించ కూడదంటూ తీర్పు వెల్లడించింది. ఈ విధంగా పోస్టర్లు అంటించాలన్న నిబంధన ఏదీ లేదని అయితే వైరస్ సోకకుండా ఇతరులను రక్షించాలన్న ఉద్దేశంతో కొన్ని రాష్ట్రాలు ఇలా చేస్తున్నాయని కేంద్రం కోర్టుకు తెలియచేసింది. దీనికి కోర్టు స్పందించి అలా చేస్తే వారిని తక్కువగా పరిగణిస్తున్నారన్న అభిప్రాయం కలుగుతుందని వ్యాఖ్యానించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News