Wednesday, May 1, 2024

టీమిండియాకు జరిమానా

- Advertisement -
- Advertisement -

ICC fined for Team India for slow overrate

 

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగిన చివరి ట్వంటీ20 మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో ఓవర్లను పూర్తి చేయడంలో విఫలమైన టీమిండియా క్రికెటర్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) జరిమానా విధించింది. స్లో ఓవర్‌రేట్ కారణంగా జట్టు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాంత కోత విధించినట్టు ఐసిసి వివరించింది. టీమిండియా బౌలర్లు నిర్ణీత సమయంలో అన్ని ఓవర్లను పూర్తి చేయలేక పోయారని, దీంతో ఫీల్డ్ అంపైర్ల నివేదిక మేరకు జరిమానా విధించినట్టు ఐసిసి ఒక ప్రకటనలో తెలిపింది. నిబంధనల మేరకే భారత ఆటగాళ్ల ఫీజులో కోత విధించాల్సి వచ్చిందని, దీనిపై ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని ఐసిసి స్పష్టం చేసింది. ఇక టీమిండియా కూడా దీనిపై ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. ఇదిలావుండగా ఆఖరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 12 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఓడినా భారత్ 21తో టి20 సిరీస్‌ను సొంతం చేసుకుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News