Tuesday, April 30, 2024

శ్రామిక్‌కు ‘ఎస్’.. ప్యాసింజర్‌కు ‘నో’

- Advertisement -
- Advertisement -

Passenger Trains

 

రైళ్లతో కరోనా రవాణా.. ఇప్పుడే నడుపొద్దు
ప్రయాణికుల ట్రైన్‌లను పునరుద్ధ్దరిస్తే వైరస్‌ను కంట్రోల్ చేయలేం
వలస కూలీలను వెళ్లనియ్యకపోతే ఆందోళనలు తలెత్తుతాయి
ఇంటికెళ్లొస్లే వాళ్లే నిమ్మల పడుతారు, శ్రామిక రైళ్ల నిర్ణయం భేష్
కరోనాతో రాష్ట్రాల ఆర్థికపరిస్థితి దారుణంగా దిగజారిపోయింది
ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితి పెంచాలి, అప్పులను రీషెడ్యూల్ చేయాలి
హైదరాబాద్ నుంచే జులై, ఆగస్టు మాసాల్లో వ్యాక్సిన్ వచ్చే అవకాశం
రాష్ట్రాల సిఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్

 

మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో నిలిపేసిన ప్రయాణికుల రైళ్లను ఇప్పుడే పునరుద్ధరించవద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రధాని మంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రాల అప్పులను రీ షెడ్యూల్ చేయాలని, ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితి పెంచాలని, ఏ రా ష్ట్రానికి చెందిన వలస కూలీలను ఆ రాష్ట్రం అనుమతించాలని సిఎం సూచించారు. జూలై-ఆగస్టు మాసాల్లోనే కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందన్నారు. అది కూడా భారత్ నుంచి, మరీ ముఖ్యంగా హైదరాబాద్ నుంచే వచ్చే అవకాశ ం ఉందని సిఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ప్ర ధాన మంత్రి నరేంద్ర మోడీ సోమవారం దేశంలోని అందరు ముఖ్యమంత్రులతో వీడియో కా న్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడు, కరోనా వ్యాప్తి నియంత్రణకు కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. దేశంలో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటూ సరైన చర్యలు తీసుకుంటున్నామని అభిప్రాయపడ్డారు. కరోనాపై తప్పక విజయం సాధిస్తామనే ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబయి, చెన్నై, హైదరాబాద్ తో పాటు చాలా నగరాల్లో కరోనా ప్రభావం అధికంగా ఉందని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.

ఆయా ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో కరోనా బాధితులున్నారన్నారు. కాబట్టి ఇప్పుడే ప్రయాణీకుల రైళ్లను నడిపితే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రాకపోకలు ఎక్కువగా జరుగుతాయని సిఎం కెసిఆర్ తెలిపారు. దీంతో ఎవరు ఎటు పోతున్నారో తెలియదన్నారు. వారికి కరోనో ఉందో లేదో తెలిసే అవకాశముండదన్నారు. ఈ నేపథ్యంలో అందరికీ టెస్టులు చేయడం కుదరదని సిఎం పేర్కొన్నారు. రైళ్లలో వచ్చిన ప్రయాణీకులను క్వారంటైన్ చేయడం కూడా కష్టమవుతుందన్నారు. కాబట్టి ఇప్పుడిప్పుడే ప్రయాణీకుల రైళ్లను నడపొద్దు అని ప్రధానికి సిఎం కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. కరోనా ఇప్పుడిప్పుడే మనల్ని వదిలి పోయేట్టు కనిపించడం లేదన్నారు. కాబట్టి కరోనాతో కలిసి బతకడం మనకు తప్పదన్నారు. ఈ విధంగా ప్రజలను ముందుకు నడిపించాల్సిన అవసముందన్నారు. ముందుగా వారిలో భయాన్ని పోగొట్టాలని సిఎం కెసిఆర్ సూచించారు. కరోనాతో కలిసి బతకడం నేర్చుకోవాలన్నారు.- వ్యాక్సిన్ వస్తే పరిస్థితిలో మార్పు వస్తుందన్నారు. -కరోనా వ్యాప్తి నియంత్రణకు తెలంగాణ ప్రభు త్వం అన్ని చర్యలు చేపట్టిందని సిఎం కెసిఆర్ వివరించారు.

వైద్యపరంగా సర్వ సిద్ధంగా ఉన్నామన్నారు. పరికరాలు, మం దులు, మాస్కులు, పిపిఇ కిట్లు, బెడ్లు.. ఇలా కావాల్సినవన్నీ ఉన్నాయన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఏ కొరతా లేదని తెలిపారు. -కరోనా వల్ల ఆర్థిక సంవత్సరంపై ప్రభావం పడిందన్నారు. ఆదాయాలు లేవు… అప్పులు కట్టే పరిస్థితి ఏ రాష్ట్రానికీ లేదన్నారు. కాబట్టి అన్ని రాష్ట్రాల అప్పులను రీ షెడ్యూల్ చేయాలని కోరారు. రైతుల రుణాలను ఎలాగైతే బ్యాంకులు రీ షెడ్యూ ల్ చేస్తాయో అలాగే రాష్ట్రాల రుణాలను రీ షెడ్యూల్ చేయడంతో పాటు కేంద్రం -ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిని కూడా పెంచాలని విజ్ఞప్తి చేశారు.

వలస కార్మికుల విషయంలో మానవత్వంతో వ్యవహరిద్దాం

వలస కార్మికుల విషయంలో అన్ని రాష్ట్రాలు సానుభూతితో, మానవత్వంతో వ్యవహరించాలని సిఎం కెసిఆర్ అన్నారు. మనది సెంటిమెంటు కలిగిన దేశమన్నారు. సొంతూర్లో పిల్లలను, తల్లిదండ్రులను వదిలి వచ్చారని సిఎం కెసిఆర్ అన్నారు. దీంతో సొంత వాళ్లను చూసుకోవాలన్న ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుందన్నారు. . అందుకే సొంతూరు పోదామనుకుంటున్నారన్నారు. వారిని పోనివ్వకపోతే అనవసరం ఆందోళన తలెత్తుతుందన్నారు. ఒకసారి పోయి వస్తే, వారు స్థిమిత పడతారన్నారు. మళ్లీ వారు పనిలోకి వస్తారని పేర్కొన్నారు. శ్రామిక్ రైళ్లు వేయడం మంచి నిర్ణయమన్నారు. తెలంగాణ నుంచి పోదామనుకుంటున్న వారిని పంపుతున్నాం…మళ్లీ ఆ కూలీలు తిరిగి వస్తున్నారన్నారు. తెలంగాణ రైసు మిల్లులలో పనిచేసే బీహార్ కార్మికులు ప్రత్యేక రైలు ద్వారా మళ్లీ తెలంగాణకు వచ్చారన్నారు. వారిని మేము సాధరంగా స్వాగతించామన్నారు. వస్తారు…. పోతారు, రానివ్వాలి…..పోనివ్వాలి…. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

కంటైన్మెంట్ జోన్లలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి

కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సిఎం కెసిఆర్ సూచించారు. ఇందులో అలక్ష్యం చేయవద్దు అన్నారు. -పాజిటివ్/యాక్టివ్ కేసులు లేని జిల్లాలను ఆరెంజ్/గ్రీన్ జోన్లుగా మార్చాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. అలా ప్రకటించడంలో జాప్యం జరుగుతుందన్నారు. పాజిటివ్ కేసులు లేని ప్రాంతాల్లో ఇతర కార్యకలాపాలు నిర్వహించుకోవడం సాధ్యమవుతుంది. కాబట్టి రాష్ట్రాల నుంచి విజ్ఞప్తి రాగానే జాప్యం లేకుండా జోన్ల మార్పు జరగాలని సిఎం కెసిఆర్ సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News