Friday, April 26, 2024

పెరగనున్న డిగ్రీ పరీక్షా కేంద్రాలు

- Advertisement -
- Advertisement -

exams

 గదులు పెంచి దూరంగా విద్యార్థుల కేటాయింపు, కొన్ని ప్రాంతాల్లో రెండు షిఫ్ట్‌లలో పరీక్షలు

హైదరాబాద్ : డిగ్రీ సెమిస్టర్ పరీక్షల కేంద్రాలు ఈ సారి పెరగనున్నాయి. పరీక్షల నిర్వహణలో భౌతిక దూరం కచ్చితంగా పాటించాలని యుజిసి సూచించిన నేపథ్యంలో పరీక్షా కేంద్రాలు పెంచడంతో పాటు కేంద్రాలలో గదులు పెంచే అంశాలను యూనివర్సిటీలు పరిశీలిస్తున్నాయి. ఒక గదిలో పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్యను సగానికి తగ్గించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రాలు పెంచడంతో పాటు, ఆయా కేంద్రాలలోని గదులను కూడా పెంచాలని వర్సిటీలు భావిస్తున్నట్లు తెలిసింది. పరీక్షా కేంద్రాలు సరిపోని ప్రాంతాలలో రెండు షిప్టులుగా పరీక్షలు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అలాంటి కేంద్రాలలో ఉదయం షిఫ్టులో బి.కాం పరీక్షలు, మధ్యాహ్నం షిఫ్టులో బిఎ,బిఎస్‌సి పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు.

మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షలు

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మార్గదర్శకాలను పాటి స్తూ జూలై మొదటి వారంలో లేదా రెండవ వారంలో డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షల నిర్వహించనున్నారు. వర్సిటీల పరిస్థితులకు అనుగుణంగా పరీక్షల నిర్వహణ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసుకునే అవకాశం ఉంది. డిగ్రీ చివరి సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు తర్వాత కోర్సులు చేయాలన్నా, ఉద్యోగాలకు వెళ్లాలన్నా పరీక్షలు పూర్తి చేసి ధ్రువపత్రాలు పొందాల్సి ఉంటుంది కాబట్టి వారికి ముందుగా పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

మిగిలిన సెమిస్టర్ల విద్యార్థులను ముందుగా పై సెమిస్టర్ల ప్రమోట్ చేసి, తర్వాత పరీక్షలు నిర్వహించాలని వర్సిటీలు నిర్ణయించాయి. గతంలో 50 శాతం సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధిస్తేనే తర్వాతి సెమిస్టర్‌కు ప్రమోట్ చేసేవారు. ఆ మేర కు ఉత్తీర్ణత సాధించనివారిని డిటెన్షన్ చేసేవారు. ప్రస్తుతం డిటెన్షన్ లేకుండా అందరినీ తర్వాతి సెమిస్టర్‌కు ప్రమోట్ చేయనున్నారు. సెమిస్టర్ తరగతులు ప్రారంభమైన తర్వా త అంతకుముందు సెమిస్టర్ పరీక్షలు జూలై చివరి వారం లేదా ఆగస్టులో నిర్వహించే అవకాశం ఉంది. ఉదాహరణకు రెండవ సెమిస్టర్ విద్యార్థులను పరీక్షలు నిర్వహించకుండానే మూడవ సెమిస్టర్‌కు ప్రమోట్ చేస్తారు. ఆ తర్వాత రెండవ సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News