Saturday, May 4, 2024

తీవ్ర అనారోగ్యంతో పుతిన్… వైద్యబృందం ఆందోళన

- Advertisement -
- Advertisement -

మాస్కో : ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్ అనారోగ్యంపై అనేక వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పుతిన్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందంటూ మరోసారి అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. తాజాగా పుతిన్ ఆరోగ్యం మరింత క్షీణించిందని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టు జనరల్ ఎస్వీర్ టెలిగ్రామ్ ఛానెల్ తన కథనంలో పేర్కొంది. తీవ్రమైన తలనొప్పి, కంటిచూపు మసకబారడం, నాలుక తిమ్మిరి తదితర అనారోగ్య లక్షణాలతో బాధపడుతున్నట్టు తెలిపింది.

పుతిన్ కుడిచేయి, కాలులో పాక్షికంగా స్పర్శ కోల్పోయినట్టు కూడా వివరించింది. వైద్య బృందం పుతిన్‌కు చికిత్స అందిస్తోందని, కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని ఆదేశించినట్టు పేర్కొంది. అయితే విశ్రాంతి తీసుకోడానికి పుతిన్ నిరాకరించినట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్‌పై దాడికి సంబంధించిన నివేదికలతో బిజీగా ఉన్నట్టు తెలియజేసింది. పుతిన్ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, సన్నిహితులు , వైద్యబృందం ఆందోళన చెందుతున్నట్టు పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News